హైదరాబాద్
ఆసియా టోర్నీ తో సింధు రీ ఎంట్రీ
హైదరాబాద్:
గాయంతో ఆటకు దూరమైన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఆసియా టీమ్ ఛాంపియన్ షిప్ లో రీ ఎంట్రీ కానుంది. ఫిబ్రవరి 13 నుంచి 19 వరకు మలేషియాలో జరిగే ఈ టోర్నీ లో సింధు బరిలోకి దిగుతుంది. లాస్ట్ ఇయర్ ఫ్రెంచ్ ఓపెన్ లో మోకాలికి గాయం కావడంతో అప్పటినుంచి ఆటకు దూరంగా ఉంది. అయితే ఇన్ని రోజులు ఆటకు దూరంగా ఉన్న సింధు ఏ విధంగా దూసుకెళ్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Last Updated:2024-01-10
హైదరాబాద్
ఇక గల్లీ క్రికెట్ కు రామ్ చరణ్ ఓనర్
హైదరాబాద్: వివిధ రంగాల్లో తన మార్కు చూపిస్తున్న రామ్ చరణ్ ఇప్పుడు స్పోర్ట్స్ లోనికి దిగుతున్నారు. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ లో హైదరాబాద్ జట్టు తాజాగా కొనుగోలు చేయడం ఆసక్తి కలిగిస్తుంది. ఇండియన్ స్టేట్ ప్రీమియర్ లీగ్ లో హైదరాబాద్ టీంకు ఓనర్ గా వ్యవహరిస్తున్నందుకు సంతోషంగా ఉంది.. ప్రతిభ, సమాజంలో స్ఫూర్తిని పెంపొందించడం మొదలుపెట్టా.. అని తన ఎక్స్ అకౌంట్లో వివరాలను పంచుకున్నారు. వచ్చే ఏడాది మార్చి 2 నుంచి 9 వరకు ఈ మ్యాచ్ లు జరుగుతాయి. ముంబై జట్టుకు అమితాబచ్చన్, బెంగళూరు టీం హృతిక్ రోషన్, జమ్మూ కాశ్మీర్ టీంకు అక్షయ్ కుమార్ ఓనర్స్ గా ఉన్నారు.
Last Updated:2023-12-24
చెన్నై
కెెఎల్ రాహుల్ ఘనత
చెన్నై: దక్షిణాఫ్రికా టూర్‌లో వన్డే సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించిన కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. 2-1 తేడాతో భారత్ సిరీస్‌ను దక్కించుకోవడంతో సౌతాఫ్రికా గడ్డపై ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ను గెలిపించిన రెండవ భారత కెప్టెన్‌గా రాహుల్ నిలిచాడు. తనకన్నా ముందు విరాట్ కోహ్లీ మాత్రమే ఈ ఘనత సాధించాడు. 21 ఏళ్లలో రెండుసార్లు మాత్రమే సఫారీలను వారి సొంత గడ్డపై భారత్ ఓడించి వన్డే సిరీస్ గెలుచుకుంది. ఇప్పటివరకు ఏడుగురు కెప్టెన్లు దక్షిణాఫ్రికా పర్యటనలో వన్డే జట్లకు నాయకత్వం వహించగా విరాట్, రాహుల్ మాత్రమే సిరీస్‌లను గెలిపించగలిగారు.
విరాట్ సారధ్యంలో టీమిండియా 2018లో 6 మ్యాచ్‌ల సిరీస్‌ను ఏకంగా 5-1తో దక్కించుకుని చరిత్రను సృష్టించింది. టీమిండియా మొట్టమొదటి దక్షిణాఫ్రికా పర్యటనకు మహ్మద్ అజారుద్దీన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. 7 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో 2-5 తేడాతో భారత్ ఓడిపోయింది. ఆ తర్వాత పర్యటనలకు రాహుల్ ద్రావిడ్, వీరేంద్ర సెహ్వాగ్, ఎంఎస్ ధోనీ వంటి దిగ్గజాలు వన్డే సిరీస్‌ను గెలిపించడంలో విఫలమయ్యారు. కాగా గతేడాది 2022లో దక్షిణాఫ్రికా పర్యటనకు కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. కానీ 3-0 తేడాతో సిరీస్‌ను దక్కించుకోలేకపోయింది.
Last Updated:2023-12-22
పార్ల్:
సిరీస్ మనదే..
పార్ల్: :
సఫారీల గడ్డ మీద భారత్ మరో వన్డే సీరీస్ గెలచింది. పార్ల్ వేదికగా సౌత్ ఆఫ్రికాలో జరిగిన కీలక పోరులో టీమ్ ఇండియా చక్కని ఆట ఆడి 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకున్నారు. భారత్ తొలుత బ్యాటింగ్ చేసి.. 296 రన్స్ చేశారు. 297 రన్స్ లక్ష్యంతో సౌతాఫ్రికా టీమ్ బరిలో్కి దిగి కేవలం 218 రన్స్ కే ఆలౌట్ అయ్యారు. శాంసన్, తిలక్ వర్మలు శతకం, అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు.
Last Updated:2023-12-22