Live

ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక
Pic Ad
    ప్రధాన వార్తలు

Pic Ad
తెలంగాణ
పోలీసుల అదుపులో ముగ్గురు కార్పొరేటర్లు..?
కరీంనగర్: కరీంనగర్ లో భూకబ్జాలకు పాల్పడిన పొలిటికల్ లీడర్లపై ఫిర్యాదులు కమిషనరేట్ కు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గత నెల రోజులుగా పలువురి కార్పొరేటర్లు.. సహా మాజీ మంత్రి గంగుల కమాలకర్ షాడో గా పేరుగాంచిన నందెల్లి మహిపాల్ ను సైతం పోలీసులు జైలుకు పంపించారు. తాజాగా కరీంనగర్ సిటీకి చెందిన మరో ముగ్గురు కార్పొరేటర్లు కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం అందుతుంది. వారి డివిజన్లలో చేస్తున్న భూకబ్జాలపై అందిన ఫిర్యాదులో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. పూర్తి స్థాయిలో విచారించిన తరవాత ఈ రోజు సాయంత్రం కానీ.. రేపు కాని అరెస్టు చూపే అవకాశాలున్నాయి. ఒకవైపు ఎక్కడిక్కడ కేసులు పెట్టి లీడర్లను అరెస్టులు చేస్తుంటే.. మాజీ రౌడీ షీటర్లు మాత్రం చెలరేగిపోతున్నారనే వార్తలు వస్తున్నాయి. సోమవారం కమిషనరేట్ లో జరిగిన ప్రజా దర్బార్ లో మాజీ రౌడీ షీటర్ అనూప్ పై భారీగా ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో సీపీ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.

Last Updated:2024-02-28

ఆంధ్రప్రదేశ్
మూడు రోజులుగా తారు డబ్బాలోనే...
మూడు రోజులుగా తారు డబ్బాలో కూలి ఇరుక్కుపోయి నరకం అనుభవించాడు. ఈ ఘటన ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా లో చోటు చేసుకుంది. బిహార్‌కు చెందిన ఓ వలస కూలి తారు డబ్బాలో ప్రమాదవశాత్తు ఇరుక్కుపోయాడు. సగం శరీరం మొత్తం తారులో బిగుసుకుపోయింది. దీంతో ఎటూ కదల్లేక పోయాడు. ఏం చేయాలో అర్థంగాక మూడు రోజులు నిద్ర, ఆహారం లేకుండా తారులోనే కూరుకుపోయాడు. బయటకు రాలేక నరకయాతన అనుభవించాడు. మూడు రోజుల తర్వాత అటుగా వెళ్తున్న స్థానికులు కూలీ అరుపులు విని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న రెస్క్యూ టీమ్ చాలా ప్రయత్నాలు చేసింది. ఎంతకీ లాగిన రాలేదు. కింద నుంచి మంట పెడతామంటే మనిషి అందులోనే కరిగిపోతాడని ఆ సాహసం చేయలేదు. కొన్ని గంటలు కష్టపడి రెస్క్యూ టీంతో కలిసి డబ్బాను కట్ చేసి అతడిని బయటకు తీశారు. ఆస్పత్రికి తరలించడంతో కథ సుఖాంతం అయింది.

Last Updated:2024-02-07

పాలిటిక్స్
కవిత విడుదల
కవిత విడుదల - బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు - జైలుకు పంపి మొండిదాన్ని చేశారు - కవిత భావోద్వేగం ఢిల్లీ , జ్వాల : ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కవిత జైలు నుంచి విడుదల అయింది. గత కొన్ని రోజులుగా పలుమార్లు బెయిల్ పిటిషన్లు వేసినా కోర్టు వాటిని కొట్టేసింది. చివరగా మంగళవారం తిహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత విడుదలయ్యారు. దిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమెకు సుప్రీంకోర్టు ఇద్దరు సభ్యుల ధర్మాసనం బెయిల్‌ మంజూరు చేసింది. పూచీకత్తు బాండ్లను ఆమె భర్త అనిల్‌, బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర దిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టుకు సమర్పించారు. ఈ పూచీకత్తులను ఆమోదించిన రౌస్‌ అవెన్యూ కోర్టు.. కవితను విడుదల చేయాలంటూ తిహార్ జైలు అధికారులకు వారెంట్‌ జారీ చేసింది. దీంతో మంగళవారం రాత్రి జైలు నుంచి విడుదలయ్యారు. మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, బీఆర్ఎస్ నాయకులు జైలు వద్దకు చేరుకుని స్వాగతం పలికారు. ఇవాళ మధ్యాహ్నం 2.45 గంటలకు కవిత హైదరాబాద్‌ రానున్నారు. తిహార్ జైలు నుంచి విడుదలైన తర్వాత కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నేతలను చూసి కవిత భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. పిల్లలను వదిలి ఐదున్నర నెలలు జైలులో ఉండటం ఇబ్బందికర విషయమన్నారు. తాను కేసీఆర్‌ బిడ్డను.. తప్పు చేసే ప్రసక్తే లేదని.. మొండిదాన్ని.. మంచిదాన్ని.. అనవసరంగా తనను జైలుకు పంపి జగమొండిని చేశారన్నారు. తనను ఇబ్బందులకు గురిచేసిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తాం అన్నారు. చట్ట బద్ధంగా తన పోరాటం కొనసాగిస్తానని, క్షేత్ర స్థాయిలో మరింత నిబద్ధతగా పనిచేస్తామన్నారు. కష్ట సమయంలో తన కుటుంబానికి తోడుగా ఉన్నవారికి ధన్యవాదాలు తెలిపారు.
న్యాయం గెలిచింది : కేటీఆర్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసిన నేపథ్యంలో ఆమె అన్న, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. ‘‘థాంక్యూ సుప్రీంకోర్టు. ఊరట లభించింది.. న్యాయం గెలిచింది’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. కవితకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేయటంపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్‌ తీవ్రంగా ఖండించారు. సుప్రీంకోర్టుకు ఉద్దేశాలు ఆపాదించేలా కామెంట్స్‌ చేశారని బండి సంజయ్‌ తీరును తప్పుబట్టారు. కేంద్రమంత్రిగా ఉంటూ ఇంత చౌకబారుగా మాట్లాడుతారా అని విమర్శించారు. దురుద్దేశపూర్వకంగా బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలను కోర్టు ధిక్కారంగా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టుకు కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.
బండి సంజయ్‌ ఏమన్నారంటే..?
కవితకు బెయిల్‌ మంజూరవడంపై కేంద్రమంత్రి బండి సంజయ్‌ ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. ‘‘బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి బెయిల్ లభించినందుకు కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ న్యాయవాదులకు అభినందనలు. మీ అలుపెరగని ప్రయత్నాలు చివరకు ఫలించాయి. ఈ బెయిల్ బీఆర్ఎస్ , కాంగ్రెస్ రెండింటికీ విజయం. బీఆర్ఎస్ లీడర్ బెయిల్‌పై బయటకు రాబోతున్నారు. కాంగ్రెస్ వ్యక్తి రాజ్యసభకు ఎంపికయ్యారు. బెయిల్ కోసం మొదట వాదించిన వ్యక్తి పోటీ చేస్తే.. ఆ అభ్యర్థికి (అభిషేక్‌ మను సింఘ్విని ఉద్దేశిస్తూ) మద్దతు ఇచ్చి కేసీఆర్‌ రాజకీయ చతురత ప్రదర్శించారు’’ అని బండి సంజయ్‌ విమర్శలు గుప్పించారు.

Last Updated:2024-08-28

క్రైమ్
రోడ్డు ప్రమాదంలో యువ ఎమ్మెల్యే దుర్మరణం
బీఆర్ఎస్ పార్టీకి చెందిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. ఓఆర్ఆర్‌పై ఆమె ప్రయాణిస్తోన్న కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత అక్కడిక్కకడే మృతి చెందారు. ఆమె పీఏతో పాటు కారు డ్రైవర్ తీవ్ర గాయాలపాలయ్యారు. కాగా, ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. దివంగత కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కూతురే లాస్య నందిత. గతేడాది సాయన్న అనారోగ్యంతో కన్నుమూయగా.. సరిగ్గా ఏడాది పూర్తవ్వగానే నందిత దుర్మరణం పాలవడం వారి కుటుంబ సభ్యులను కలిచివేస్తుంది. వారంతా తీవ్ర విషాదంలో ఉన్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గద్దర్ కూతురు వెన్నెలపై కంటోన్మెంట్ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

విధిరాతను తప్పించలేకపోయింది ..

లాస్య నందితకు ఈ మధ్యకాలంలోనే రెండు సార్లు ప్రాణాలనుంచి బయటపడి గండం గట్టెక్కింది. రెండు నెలల కిందట ఒక ప్రోగ్రామ్ కు వెళ్లిన ఎమ్మెల్యే లాస్య లిఫ్ట్ లో ఇరుక్కుపోయింది. సుమారుగా గంట పాటు అందులోనే నరకం అనుభవించింది. ఆ తరవాత ఇటీవల నల్లగొండ కేసీఆర్ సభకు వెళ్లి తిరిగి వస్తుండగా.. లాస్య కారును మరో వాహనం వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో ఆమె కారు ముందుకు దూసుకెళ్లి ఒక హోం గార్డు అక్కడిక్కడే చనిపోయాడు. రెండు సార్లు గండాల నుంచి తప్పించుకున్నా.. ఈ సారి రోడ్డు ప్రమాదరూపంలో యువ ఎమ్మెల్యేను బలితీసుకుంది.

Last Updated:2024-02-23

సినిమా రివ్యూ
గుంటూరు కారం గురించి పబ్లిక్ టాక్ ఏంటంటే..
గుంటూరు కారం శుక్రవారం ప్రిమీయర్ షో చూసిన వాళ్ల నుంచి పబ్లిక్ టాక్ అయితే వచ్చింది. ఈ సినిమాలో మహేశ్ బాబు.. శ్రీలీల జంటగా త్రివిక్రమ్ డైరెక్ట్ చేశారు. పెద్ద డైరెక్టర్ అని నమ్మి వచ్చిన మహేశ్ బాబుకు కాస్త నిరాశే మిగిల్చిందని సినీ అభిమానులు అంటున్నారు. ఒక చిన్న లైన్ ను తీసుకుని కథంతా సాగదీశారని కొందురు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా మహేశ్ బాబు డ్యాన్స్ ఇరగదీశారనే టాక్ వచ్చింది. కేవలం మహేశ్ బాబు మాత్రమే సినిమా అంతా భుజాల మీద మోసుకొచ్చాడని చెబుతున్నారు. శ్రీలీలను హీరోయిన్ గా పెట్టుకున్న.. సరైన విధంగా రోల్ ఇవ్వకపోవడం మైనస్ అంటున్నారు ప్రేక్షకులు. గతంలో ఆదికేశవ వంటి సినిమాల్లో కూడా కేవలం గ్లామర్ కోసమే తీసుకోవడం వల్ల పెద్దగా ఒరిగిందేమి లేదని.. ఈ సినిమాలో కూడా అదే పరిస్థితి అయిందంటున్నారు. మహేశ్ లుంగి కట్టుకుని ఉంటే.. శ్రీలీల వచ్చి లుంగి లాగేస్తే కేవలం షార్ట్ మీదనే హీరో ఉండటం వంటి సీన్లు ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తాయంటున్నారు. ఫైట్లు క్లియర్ గా చూపించారని.. క్లైమాక్స్ 10 నిమిషాలు బాగుందని అంటున్నారు. ఓవరాల్ గా ఆడియన్స్ ఇచ్చే రేటింగ్ 2 నుంచి 2.5 అంటున్నారు.

Last Updated:2024-01-12

క్రీడలు
ఆసియా టోర్నీ తో సింధు రీ ఎంట్రీ
గాయంతో ఆటకు దూరమైన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఆసియా టీమ్ ఛాంపియన్ షిప్ లో రీ ఎంట్రీ కానుంది. ఫిబ్రవరి 13 నుంచి 19 వరకు మలేషియాలో జరిగే ఈ టోర్నీ లో సింధు బరిలోకి దిగుతుంది. లాస్ట్ ఇయర్ ఫ్రెంచ్ ఓపెన్ లో మోకాలికి గాయం కావడంతో అప్పటినుంచి ఆటకు దూరంగా ఉంది. అయితే ఇన్ని రోజులు ఆటకు దూరంగా ఉన్న సింధు ఏ విధంగా దూసుకెళ్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Last Updated:2024-01-10

Pic Ad
alt తెలంగాణ
Updated:2024-02-28
పోలీసుల అదుపులో ముగ్గురు కార్పొరేటర్లు..?
3         2159
Updated:2024-02-28
పోలీసుల అదుపులో ముగ్గురు ర్పొరేటర్లు..?
0         899
Updated:2024-02-20
గంగుల షాడో అరెస్టు..?
0         1340
Updated:2024-02-16
గురుకుల టీచర్ల అభ్యర్థులకు నియామకపత్రాల అందజేత
0         786
Updated:2024-02-16
అధికారులు లేకుండానే బడ్జెట్
0         910
Updated:2024-02-06
అనాథలకు సేవచేస్తేనే ఆనందం
2         828
Updated:2024-01-30
ప్రభుత్వ భూమిలో రోడ్.. డ్రైనైజీ నిర్మాణం
1         1099
Updated:2024-01-29
ఊరి భూమిని కాపాడండి: సర్పంచి కలెక్టర్ కు ఫిర్యాదు
1         1758
Updated:2024-01-26
ప్రభుత్వ భూమి కాపాడండి: దుర్గం మనోహర్
0         827
Updated:2024-01-25
ఉద్యమకారుల ఫోరం కన్వీనర్ గా కుమార్
1         1738
Updated:2024-01-10
ప్రజాపాలనకు సోనియా గాంధీ దరఖాస్తు: సోషల్ మీడియాలో చక్కర్లు
3         1150
Updated:2024-01-09
ఫిబ్రవరిలోనే ఎన్నికల కోడ్: బండి సంజయ్
3         831
Updated:2024-01-05
కొత్త హైకోర్టు నిర్మాణానికి 100 ఎకరాల కేటాయింపు
0         747
Updated:2024-01-05
ఇక వాళ్లకు ఢోకా లేదు: మంత్రి సీతక్క
9         849
Updated:2024-01-05
హైర్ బస్సుల సమస్యలపై కమిటీ
0         728
alt ఆంధ్రప్రదేశ్
Updated:2024-02-07
మూడు రోజులుగా తారు డబ్బాలోనే...
5         970
Updated:2024-01-10
జోరందుకున్న ఆంధ్రా పాలిటిక్స్
17         914
Updated:2024-01-10
వైసీపీకి అధ్యక్షుడే లేడు: వేగుళ్ల లీలా క్రిష్ణ
3         749
Updated:2024-01-10
టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే ..?
5         712
Updated:2024-01-09
గ్రూప్ 2 అప్లై చేసేందుకు టెక్నికల్ ఇష్యూస్
4         715
Updated:2024-01-03
వైఎస్సార్ ఘాట్ వద్ద తొలి పత్రిక
0         672
Updated:2023-12-27
ఆయేషా కేసులో సీబీఐకి నోటీసులు
0         692
Updated:2023-12-26
చైన్నై సూపర్ కింగ్స్ ముందుకు వచ్చింది: జగన్
1         650
Updated:2023-12-26
వర్మ ఇంటి ఎదుట టీడీపీ కార్యకర్తల ఆందోళన
0         638
Updated:2023-12-26
ఏపీలో గ్రామ వలంటీర్లు నేటి నుంచి సమ్మె
0         665
Updated:2023-12-24
మర్యాదపూర్వకమే మా మీటింగ్ : ప్రశాంత్ కిశోర్
0         637
Updated:2023-12-23
జగన్ మూడు రోజుల కడప పర్యటన
0         704
Updated:2023-12-23
అక్రమ అరెస్టులు కాదు.. అంగన్వాడీ సమస్యలు చూడండి: చంద్రబాబు
1         726
Updated:2023-12-22
డివైడర్ ఢికోట్టిన కారు
0         679
Updated:2023-12-22
శ్రీవారి దర్శనం గందరగోళం
0         691
ఉద్యోగ నోటిఫికేషన్‌లు

ఏపీలో 240 డిగ్రీ లెక్చరర్ పోస్టులు
Read

ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ లో జాబ్ లు
Read

ssc posts released
Read

teacher posts
Read

పదో తరగతి అర్హతతో రైల్వే శాఖలో 3వేలకు పైగా ఉద్యోగాలు : జనవరి ఫస్ట్ లాస్ట్ డేట్
Read

ఐడీబీఐ బ్యాంకులో 89 ఆఫీసర్ క్యాడర్ పోస్టుల కోసం నోటీఫీకేషన్ విడుదల... చివరి తేది : 25.12.2023
Read

ఐడీబీఐ బ్యాంకులో 89 స్పెషలిస్టు ఆఫీసర్ పోస్టులు
Read

సినిమా రివ్యూ
టెక్నాలాజీ
Updated:2023-12-22
పాత ఫోన్ అమ్ముతున్నారా..?
ట్రెండింగ్
Updated:2024-08-28
500 కార్లతో కవిత రాక        |       382 Reading
Updated:2023-12-25
రామమందిరమే ప్రచారాస్త్రం        |       159 Reading
Updated:2023-12-29
కాళేశ్వరం కట్టడం వెనక రాజకీయ కోణమే : నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి        |       489 Reading
Updated:2024-01-10
ముఖ్యమంత్రితో అమెజాన్ ప్రతినిధుల భేటీ        |       457 Reading
Updated:2023-12-25
అటల్ కు ఘన నివాళి        |       445 Reading
Updated:2024-09-15
కేరళలో ఓనమ్ కోలాహాలం        |       296 Reading
Updated:2024-09-15
కేరళలో ఓనమ్ కోలాహలం        |       398 Reading
Updated:2023-12-30
80 కొత్త బస్సులు ప్రారంభం        |       363 Reading
చరిత్రలో ఈరోజు [Feb-06 ]

1819: సర్ థామస్ స్టామ్ఫోర్డ్ రాఫెల్స్ సింగపూరు పట్టణాన్ని కనుగొన్నాడు.,
1952: విక్టోరియా మహారాణి అనంతరం ఎలిజబెత్ II యునైటెడ్ కింగ్డం మహారాణిగా కిరీటాన్ని ధరించింది.
2000: ఫిన్లాండు తొలి మహిళా అధ్యక్షురాలిగా టార్జా హలోనెల్ ఎన్నికైంది.
2023 - ఆగ్నేయ టర్కీలోని గాజియాంటెప్ ప్రావిన్స్‌లో 7.8 (Mww) భూకంపం సంభవించింది. సమీపంలోని కహ్రమన్మరాస్ ప్రావిన్స్‌లో అదే రోజున 7.5 Mww ఆఫ్టర్‌షాక్ ఏర్పడింది. టర్కీ, సిరియాలలో అధిక నష్టం జరుగగా 34,800 మందికి పైగా మరణించారు, 87,000 మందికిపైగా గాయపడ్డారు.
2023: తెలంగాణ శాసనసభ సమావేశాలలో 2023-24 ఆర్థిక సంవత్సారానికి బడ్జెట్ ప్రవేశపెట్టబడింది.

WhatsApp