Live

ఢిల్లీ: రాజ్యసభ ఎన్నికలకు నోటీఫికేషన్ జారీ చేసిన సీఈసీ హైదరాబాద్: ఈ రోజు సాయంత్రం పీసీసీ ఎలక్షన్ కమిటి సమావేశం ఢిల్లీ: ఉత్తర భారతంలో కొనసాగుతున్న చలితీవ్రత.. పొగమంచు కారణంగా ఆలస్యంగా నడుస్తున్న ట్రైన్లు, విమానాలు హైదరాబాద్: నేటితో ముగియనున్న ట్రాఫిక్ చలాన్ల గడువు సుడాన్: దక్షిణ సుడాన్ లో దాడులు.. 50 మంది మ్రుతి
Pic Ad
    ప్రధాన వార్తలు

Pic Ad
తెలంగాణ
పోలీసుల అదుపులో ముగ్గురు కార్పొరేటర్లు..?
కరీంనగర్: కరీంనగర్ లో భూకబ్జాలకు పాల్పడిన పొలిటికల్ లీడర్లపై ఫిర్యాదులు కమిషనరేట్ కు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గత నెల రోజులుగా పలువురి కార్పొరేటర్లు.. సహా మాజీ మంత్రి గంగుల కమాలకర్ షాడో గా పేరుగాంచిన నందెల్లి మహిపాల్ ను సైతం పోలీసులు జైలుకు పంపించారు. తాజాగా కరీంనగర్ సిటీకి చెందిన మరో ముగ్గురు కార్పొరేటర్లు కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం అందుతుంది. వారి డివిజన్లలో చేస్తున్న భూకబ్జాలపై అందిన ఫిర్యాదులో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. పూర్తి స్థాయిలో విచారించిన తరవాత ఈ రోజు సాయంత్రం కానీ.. రేపు కాని అరెస్టు చూపే అవకాశాలున్నాయి. ఒకవైపు ఎక్కడిక్కడ కేసులు పెట్టి లీడర్లను అరెస్టులు చేస్తుంటే.. మాజీ రౌడీ షీటర్లు మాత్రం చెలరేగిపోతున్నారనే వార్తలు వస్తున్నాయి. సోమవారం కమిషనరేట్ లో జరిగిన ప్రజా దర్బార్ లో మాజీ రౌడీ షీటర్ అనూప్ పై భారీగా ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో సీపీ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.

Last Updated:2024-02-28

ఆంధ్రప్రదేశ్
మూడు రోజులుగా తారు డబ్బాలోనే...
మూడు రోజులుగా తారు డబ్బాలో కూలి ఇరుక్కుపోయి నరకం అనుభవించాడు. ఈ ఘటన ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా లో చోటు చేసుకుంది. బిహార్‌కు చెందిన ఓ వలస కూలి తారు డబ్బాలో ప్రమాదవశాత్తు ఇరుక్కుపోయాడు. సగం శరీరం మొత్తం తారులో బిగుసుకుపోయింది. దీంతో ఎటూ కదల్లేక పోయాడు. ఏం చేయాలో అర్థంగాక మూడు రోజులు నిద్ర, ఆహారం లేకుండా తారులోనే కూరుకుపోయాడు. బయటకు రాలేక నరకయాతన అనుభవించాడు. మూడు రోజుల తర్వాత అటుగా వెళ్తున్న స్థానికులు కూలీ అరుపులు విని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న రెస్క్యూ టీమ్ చాలా ప్రయత్నాలు చేసింది. ఎంతకీ లాగిన రాలేదు. కింద నుంచి మంట పెడతామంటే మనిషి అందులోనే కరిగిపోతాడని ఆ సాహసం చేయలేదు. కొన్ని గంటలు కష్టపడి రెస్క్యూ టీంతో కలిసి డబ్బాను కట్ చేసి అతడిని బయటకు తీశారు. ఆస్పత్రికి తరలించడంతో కథ సుఖాంతం అయింది.

Last Updated:2024-02-07

పాలిటిక్స్
ఢిల్లీ ధర్నాకు డి.టి.ఎఫ్. నాయకులు
కేంద్రం అమలు చేస్తున్న జాతీయ విద్యావిధానాన్ని నిరసిస్తూ దేశరాజధాని ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద అఖిల భారత విద్యా హక్కు ఫోరమ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ధర్నాలో పాల్గొనేందుకు కరీంనగర్ జిల్లాకు చెందిన డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర,జిల్లా నాయకత్వం శుక్రవారం బయలుదేరారు. 46 మంది బృందం రామగుండం నుంచి ఏపీ ఎక్స్ ప్రెస్ రైల్లో వెళ్లారు. 2020 నుండి కేంద్రప్రభుత్వం అమలు పరుస్తున్న జాతీయ విద్యావిధానాన్ని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ తీవ్రంగా వ్యతిరేకించడమే గాకుండా, పూర్తిగా ప్రభుత్వరంగంలో కొనసాగించవలసిన విద్యను ప్రైవేటికరిస్తూ,కాషాయీ కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపిస్తున్న విషయం తెలిసింది. జాతీయ స్థాయిలో అఖిలభారత విద్యా హక్కు ఫోరమ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ జరుగుతున్న పోరాటంలో భాగంగా డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేష క్రియాశీల ఉద్యమాలను నిర్వహిస్తున్నది.

ఈ కార్యక్రమంలో డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వైద్యుల రాజిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బి.శ్యాం,రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఎం.రఘుశంకర్ రెడ్డి,రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ పల్కల ఈశ్వర్ రెడ్డి ,పూర్వ రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ డి. ఏసురెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి తూముల తిరుపతి, జిల్లా ఉపాధ్యక్షులు ఆవాల నరహరి, సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులు యం.విష్ణు, కరీంనగర్ జిల్లా కార్యదర్శి ఏబూషి శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిలర్లు వి.రాంకిరణ్, పి.నర్సయ్య ,బి.సుదర్శన్ రెడ్డి, ఏ.రాంమోహన్, మండలాల బాధ్యులు,బి.శ్రీనివాస్ , కె.వెంకటస్వామి,కె.శ్రీనివాస్,సంపత్,తదితరులు ఈ బృందంలో వున్నారు.

Last Updated:2024-02-02

క్రైమ్
రోడ్డు ప్రమాదంలో యువ ఎమ్మెల్యే దుర్మరణం
బీఆర్ఎస్ పార్టీకి చెందిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. ఓఆర్ఆర్‌పై ఆమె ప్రయాణిస్తోన్న కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత అక్కడిక్కకడే మృతి చెందారు. ఆమె పీఏతో పాటు కారు డ్రైవర్ తీవ్ర గాయాలపాలయ్యారు. కాగా, ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. దివంగత కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కూతురే లాస్య నందిత. గతేడాది సాయన్న అనారోగ్యంతో కన్నుమూయగా.. సరిగ్గా ఏడాది పూర్తవ్వగానే నందిత దుర్మరణం పాలవడం వారి కుటుంబ సభ్యులను కలిచివేస్తుంది. వారంతా తీవ్ర విషాదంలో ఉన్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గద్దర్ కూతురు వెన్నెలపై కంటోన్మెంట్ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

విధిరాతను తప్పించలేకపోయింది ..

లాస్య నందితకు ఈ మధ్యకాలంలోనే రెండు సార్లు ప్రాణాలనుంచి బయటపడి గండం గట్టెక్కింది. రెండు నెలల కిందట ఒక ప్రోగ్రామ్ కు వెళ్లిన ఎమ్మెల్యే లాస్య లిఫ్ట్ లో ఇరుక్కుపోయింది. సుమారుగా గంట పాటు అందులోనే నరకం అనుభవించింది. ఆ తరవాత ఇటీవల నల్లగొండ కేసీఆర్ సభకు వెళ్లి తిరిగి వస్తుండగా.. లాస్య కారును మరో వాహనం వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో ఆమె కారు ముందుకు దూసుకెళ్లి ఒక హోం గార్డు అక్కడిక్కడే చనిపోయాడు. రెండు సార్లు గండాల నుంచి తప్పించుకున్నా.. ఈ సారి రోడ్డు ప్రమాదరూపంలో యువ ఎమ్మెల్యేను బలితీసుకుంది.

Last Updated:2024-02-23

సినిమా రివ్యూ
గుంటూరు కారం గురించి పబ్లిక్ టాక్ ఏంటంటే..
గుంటూరు కారం శుక్రవారం ప్రిమీయర్ షో చూసిన వాళ్ల నుంచి పబ్లిక్ టాక్ అయితే వచ్చింది. ఈ సినిమాలో మహేశ్ బాబు.. శ్రీలీల జంటగా త్రివిక్రమ్ డైరెక్ట్ చేశారు. పెద్ద డైరెక్టర్ అని నమ్మి వచ్చిన మహేశ్ బాబుకు కాస్త నిరాశే మిగిల్చిందని సినీ అభిమానులు అంటున్నారు. ఒక చిన్న లైన్ ను తీసుకుని కథంతా సాగదీశారని కొందురు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా మహేశ్ బాబు డ్యాన్స్ ఇరగదీశారనే టాక్ వచ్చింది. కేవలం మహేశ్ బాబు మాత్రమే సినిమా అంతా భుజాల మీద మోసుకొచ్చాడని చెబుతున్నారు. శ్రీలీలను హీరోయిన్ గా పెట్టుకున్న.. సరైన విధంగా రోల్ ఇవ్వకపోవడం మైనస్ అంటున్నారు ప్రేక్షకులు. గతంలో ఆదికేశవ వంటి సినిమాల్లో కూడా కేవలం గ్లామర్ కోసమే తీసుకోవడం వల్ల పెద్దగా ఒరిగిందేమి లేదని.. ఈ సినిమాలో కూడా అదే పరిస్థితి అయిందంటున్నారు. మహేశ్ లుంగి కట్టుకుని ఉంటే.. శ్రీలీల వచ్చి లుంగి లాగేస్తే కేవలం షార్ట్ మీదనే హీరో ఉండటం వంటి సీన్లు ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తాయంటున్నారు. ఫైట్లు క్లియర్ గా చూపించారని.. క్లైమాక్స్ 10 నిమిషాలు బాగుందని అంటున్నారు. ఓవరాల్ గా ఆడియన్స్ ఇచ్చే రేటింగ్ 2 నుంచి 2.5 అంటున్నారు.

Last Updated:2024-01-12

క్రీడలు
ఆసియా టోర్నీ తో సింధు రీ ఎంట్రీ
గాయంతో ఆటకు దూరమైన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఆసియా టీమ్ ఛాంపియన్ షిప్ లో రీ ఎంట్రీ కానుంది. ఫిబ్రవరి 13 నుంచి 19 వరకు మలేషియాలో జరిగే ఈ టోర్నీ లో సింధు బరిలోకి దిగుతుంది. లాస్ట్ ఇయర్ ఫ్రెంచ్ ఓపెన్ లో మోకాలికి గాయం కావడంతో అప్పటినుంచి ఆటకు దూరంగా ఉంది. అయితే ఇన్ని రోజులు ఆటకు దూరంగా ఉన్న సింధు ఏ విధంగా దూసుకెళ్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Last Updated:2024-01-10

Pic Ad
alt తెలంగాణ
Updated:2024-02-28
పోలీసుల అదుపులో ముగ్గురు కార్పొరేటర్లు..?
3         1736
Updated:2024-02-28
పోలీసుల అదుపులో ముగ్గురు ర్పొరేటర్లు..?
0         606
Updated:2024-02-20
గంగుల షాడో అరెస్టు..?
0         929
Updated:2024-02-16
గురుకుల టీచర్ల అభ్యర్థులకు నియామకపత్రాల అందజేత
0         526
Updated:2024-02-16
అధికారులు లేకుండానే బడ్జెట్
0         535
Updated:2024-02-06
అనాథలకు సేవచేస్తేనే ఆనందం
2         603
Updated:2024-01-30
ప్రభుత్వ భూమిలో రోడ్.. డ్రైనైజీ నిర్మాణం
1         740
Updated:2024-01-29
ఊరి భూమిని కాపాడండి: సర్పంచి కలెక్టర్ కు ఫిర్యాదు
1         1498
Updated:2024-01-26
ప్రభుత్వ భూమి కాపాడండి: దుర్గం మనోహర్
0         592
Updated:2024-01-25
ఉద్యమకారుల ఫోరం కన్వీనర్ గా కుమార్
1         1401
Updated:2024-01-10
ప్రజాపాలనకు సోనియా గాంధీ దరఖాస్తు: సోషల్ మీడియాలో చక్కర్లు
3         904
Updated:2024-01-09
ఫిబ్రవరిలోనే ఎన్నికల కోడ్: బండి సంజయ్
3         588
Updated:2024-01-05
కొత్త హైకోర్టు నిర్మాణానికి 100 ఎకరాల కేటాయింపు
0         539
Updated:2024-01-05
ఇక వాళ్లకు ఢోకా లేదు: మంత్రి సీతక్క
9         608
Updated:2024-01-05
హైర్ బస్సుల సమస్యలపై కమిటీ
0         547
alt ఆంధ్రప్రదేశ్
Updated:2024-02-07
మూడు రోజులుగా తారు డబ్బాలోనే...
5         681
Updated:2024-01-10
జోరందుకున్న ఆంధ్రా పాలిటిక్స్
17         693
Updated:2024-01-10
వైసీపీకి అధ్యక్షుడే లేడు: వేగుళ్ల లీలా క్రిష్ణ
3         524
Updated:2024-01-10
టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే ..?
5         535
Updated:2024-01-09
గ్రూప్ 2 అప్లై చేసేందుకు టెక్నికల్ ఇష్యూస్
3         607
Updated:2024-01-03
వైఎస్సార్ ఘాట్ వద్ద తొలి పత్రిక
0         529
Updated:2023-12-27
ఆయేషా కేసులో సీబీఐకి నోటీసులు
0         548
Updated:2023-12-26
చైన్నై సూపర్ కింగ్స్ ముందుకు వచ్చింది: జగన్
1         540
Updated:2023-12-26
వర్మ ఇంటి ఎదుట టీడీపీ కార్యకర్తల ఆందోళన
0         533
Updated:2023-12-26
ఏపీలో గ్రామ వలంటీర్లు నేటి నుంచి సమ్మె
0         533
Updated:2023-12-24
మర్యాదపూర్వకమే మా మీటింగ్ : ప్రశాంత్ కిశోర్
0         524
Updated:2023-12-23
జగన్ మూడు రోజుల కడప పర్యటన
0         549
Updated:2023-12-23
అక్రమ అరెస్టులు కాదు.. అంగన్వాడీ సమస్యలు చూడండి: చంద్రబాబు
1         565
Updated:2023-12-22
డివైడర్ ఢికోట్టిన కారు
0         537
Updated:2023-12-22
శ్రీవారి దర్శనం గందరగోళం
0         523
ఉద్యోగ నోటిఫికేషన్‌లు

ఏపీలో 240 డిగ్రీ లెక్చరర్ పోస్టులు
Read

ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ లో జాబ్ లు
Read

ssc posts released
Read

teacher posts
Read

పదో తరగతి అర్హతతో రైల్వే శాఖలో 3వేలకు పైగా ఉద్యోగాలు : జనవరి ఫస్ట్ లాస్ట్ డేట్
Read

ఐడీబీఐ బ్యాంకులో 89 ఆఫీసర్ క్యాడర్ పోస్టుల కోసం నోటీఫీకేషన్ విడుదల... చివరి తేది : 25.12.2023
Read

ఐడీబీఐ బ్యాంకులో 89 స్పెషలిస్టు ఆఫీసర్ పోస్టులు
Read

సినిమా రివ్యూ
టెక్నాలాజీ
Updated:2023-12-22
పాత ఫోన్ అమ్ముతున్నారా..?
ట్రెండింగ్
Updated:2023-12-25
ఇండియన్ విమానం సురక్షితమే        |       386 Reading
Updated:2024-01-10
ముఖ్యమంత్రితో అమెజాన్ ప్రతినిధుల భేటీ        |       126 Reading
Updated:2024-01-10
మీరే అమ్మ.. మీరే నాన్న: మహేశ్ బాబు ఎమోషనల్ స్పీచ్        |       141 Reading
Updated:2023-12-29
2030 నాటికి దేశంలో 200 ఎయిర్ పోర్టులు        |       112 Reading
Updated:2023-12-26
లఢఖ్ లో భూకంపం        |       485 Reading
Updated:2023-12-22
హైదరాబాద్ లో ఇద్దరు పిల్లలకు కరోనా        |       260 Reading
Updated:2023-12-30
ఆయోధ్యలో రైలు ప్రారంభించిన మోదీ        |       433 Reading
Updated:2024-01-02
నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ తో భేటి        |       388 Reading
చరిత్రలో ఈరోజు [Feb-06 ]

1819: సర్ థామస్ స్టామ్ఫోర్డ్ రాఫెల్స్ సింగపూరు పట్టణాన్ని కనుగొన్నాడు.,
1952: విక్టోరియా మహారాణి అనంతరం ఎలిజబెత్ II యునైటెడ్ కింగ్డం మహారాణిగా కిరీటాన్ని ధరించింది.
2000: ఫిన్లాండు తొలి మహిళా అధ్యక్షురాలిగా టార్జా హలోనెల్ ఎన్నికైంది.
2023 - ఆగ్నేయ టర్కీలోని గాజియాంటెప్ ప్రావిన్స్‌లో 7.8 (Mww) భూకంపం సంభవించింది. సమీపంలోని కహ్రమన్మరాస్ ప్రావిన్స్‌లో అదే రోజున 7.5 Mww ఆఫ్టర్‌షాక్ ఏర్పడింది. టర్కీ, సిరియాలలో అధిక నష్టం జరుగగా 34,800 మందికి పైగా మరణించారు, 87,000 మందికిపైగా గాయపడ్డారు.
2023: తెలంగాణ శాసనసభ సమావేశాలలో 2023-24 ఆర్థిక సంవత్సారానికి బడ్జెట్ ప్రవేశపెట్టబడింది.

WhatsApp