తొర్రూరు
స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ తో యువతకు మేలు
మహబూబాబాద్: హనుమాండ్ల ఝాన్సీ-రాజేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు చారిటబుల్ ట్రస్టు ద్వారా వేలాదిమంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి తమ సొంత స్థలం 75 ఎకరాలలో లక్ష్మమ్మ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మించి యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే పునాదిరాయి సోమవారం వేశారు. మహబూబాబాద్ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గం.. తొర్రూరు మండలం గుర్తూరు గ్రామంలో పెద్ద ఎత్తున్న నిర్మించతలపెట్టిన స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ కు హానుమండ్ల ఝాన్సి రాజేందర్ రెడ్డి దంపతులతో కలిసి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి దంపతులు భూమి పూజ పాల్గొన్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గంలోని యువతకు ఈ స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ఎంతో మందికి నైపుణ్యాలు డెవలప్ చేసుకునేందుకు దోహదం చేయనుందని నిర్వాహకులు తెలిపారు.
యువత దీన్ని వినియోగించుకోవాలని వారు సూచించారు. గతంలోనే అనాధ పిల్లల కోసం .. వృద్ధుల కోసం ఆశ్రమాలు స్థాపించి చారిత్రాత్మకమైన మార్పు తెచ్చారు. ఇటీవలి ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా దాన్ని నెరవేర్చే దిశగా చేపట్టిన భూమి పూజ కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దేవరుప్పుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి గౌడ్ ఆద్వర్యంలో గుర్తూరుకు దేవరుప్పుల మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళినాయక్, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య పాల్గొన్నారు.
Last Updated:2024-01-08
తొర్రూరు
యువతకు ఉపాధి కల్పన దిశగా..
మహబూబాబాద్: హనుమాండ్ల ఝాన్సీ-రాజేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు చారిటబుల్ ట్రస్టు ద్వారా వేలాదిమంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి తమ సొంత స్థలంలో 75 ఎకరాలలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మించి యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే పునాదిరాయి సోమవారం పడింది. మహబూబాబాద్ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గం.. తొర్రూరు మండలం గుర్తూరు గ్రామంలో పెద్ద ఎత్తున్న నిర్మించతలపెట్టిన స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ కు హానుమండ్ల ఝాన్సి రాజేందర్ రెడ్డి దంపతులు భూమి పూజ చేశారు. వీరితో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి దంపతులు పాల్గొన్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గంలోని యువతకు ఈ స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ఎంతో మందికి నైపుణ్యాలు డెవలప్ చేసుకునేందుకు దోహదం చేయనుందని నిర్వాహకులు తెలిపారు. యువత దీన్ని వినియోగించుకోవాలని వారు సూచించారు. గతంలోనే అనాధ పిల్లల కోసం .. వృద్ధుల కోసం ఆశ్రమాలు స్థాపించి చారిత్రాత్మకమైన మార్పు తెచ్చారు. ఇటీవలి ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా దాన్ని నెరవేర్చే దిశగా చేపట్టిన భూమి పూజ కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దేవరుప్పుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి గౌడ్ ఆద్వర్యంలో గుర్తూరుకు దేవరుప్పుల మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు.
Last Updated:2024-01-08
కొత్తగూడ
మంత్రి సీతక్క సమీక్ష
మహబూబాబాద్: కొత్తగూడ మరియు గంగారం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి మంగళవారం PO, ITDA Eturunagram, SP మహబాద్, జిల్లా కలెక్టర్ శశాంక తో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మంచినీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సంబధిత అధికారులను సమీక్షించారు.
Last Updated:2023-12-26
మహబుబాబాద్
జాతీయ యువజన ఉత్సవాలు
మహబూబాబాద్: శనివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో స్వామి వివేకానంద జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని జాతీయ యువజన ఉత్సవాలు-2023 కార్యక్రమాన్ని జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ శశాంక జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం చిత్రపటానికి పూలమాలలు సమర్పించి పాల్గొన్నారు.
Last Updated:2023-12-25