నారాయణపేట: వార్షిక తనిఖీల్లో భాగంగా నారాయణపేట సబ్ డివిజనల్ పోలీస్ అధికారి k సత్యనారాయణ మక్తల్ పోలీస్ స్టేషన్ ను సందర్శించి సిబ్బంది యొక్క వివరాలు, వారు నిర్వహిస్తున్న విధుల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలని,శిక్ష శాతం పెంచాలని ఆయన సూచించారు.
నర్వ మండలంలోని ఉందే కోడ్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పోలీస్ కళాబృందం వారు బాల కార్మిక వ్యవస్థ, సైబర్ నేరాలు, అమ్మాయిలు మహిళల పై వేధింపులు, లీడర్షిప్ లక్షణాలు, పౌరుల హక్కులు మొదలగు విషయాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.