ఆస్తమా ఉన్నవారు.. ఏదైనా వ్యాయామం, శారీరక శ్రమ ప్రారంభించే ముందు డాక్టర్‌ను సంప్రదించడం మేలు. వ్యాయామం చేసే ముందు బ్రోంకోడైలేటర్ ఇన్‌హేలర్‌ని ఉపయోగించండి. ముఖ్యంగా శీతాకాలంలో.. వెచ్చగా ఉండే ప్రదేశాలలో ఎక్స్‌ర్‌సైజ్ చేయండి. చల్ల గాలి, కాలుష్యం, పుప్పొడి వంటి ట్రిగ్గర్ పాయింట్స్‌కు దూరంగా ఉండండి. ఆస్తమా పేషెంట్స్ హై ఇంటెన్సిటి వ్యాయామాలకు దూరంగా ఉండాలని నిపుణులు అంటున్నారు. రన్నింగ్, బాస్కెట్‌బాల్ హై ఇంటెన్సిటీ వర్క్‌అవుట్స్ ఆస్తమా లక్షణాలను తీవ్రతరం చేస్తాయి. వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, యోగా వంటి తక్కువ తీవ్రత ఉన్న వ్యాయామాలు ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.