తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కరీంనగర్ పట్టణం బీ ఎస్ ఎన్ ఎల్ కార్యాలయం ముందు 2024 నూతన సంవత్సర క్యాలెండర్, డైరీ కార్మికులతో ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన టిపిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మాడుగుల రాములు, టీ పి టి ఫ్ జిల్లా అధ్యక్షుడు పోరెడ్డి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో ఉన్న ప్రజలందరికీ అంతరాలు లేని ,నాణ్యమైన , శాస్త్రీయమైన విద్య అందాలంటే ప్రభుత్వం వెంటనే కామన్ స్కూల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. కోర్టు కేసుల వల్ల ఆగిపోయిన టీచర్ల బదిలీల ప్రమోషన్ల ప్రక్రియను వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఉపాధ్యాయ, ఉద్యోగులకు జీవిత భద్రతకు పెనుముప్పుగా మారిన సీపీఎస్ వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు . ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న మూడు డిఏలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో వెంటనే స్కావెంజర్లను నియమించాలని కోరారు. పాఠశాలలో కొనసాగుతున్న తొలిమెట్టు ఉన్నతి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించి పాఠశాలల్లో ఉపాధ్యాయులకు తరగతి గదిలో బోధించే స్వేచ్ఛను కల్పించాలని కోరారు.