మూడు రోజులుగా తారు డబ్బాలో కూలి ఇరుక్కుపోయి నరకం అనుభవించాడు. ఈ ఘటన ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా లో చోటు చేసుకుంది. బిహార్‌కు చెందిన ఓ వలస కూలి తారు డబ్బాలో ప్రమాదవశాత్తు ఇరుక్కుపోయాడు. సగం శరీరం మొత్తం తారులో బిగుసుకుపోయింది. దీంతో ఎటూ కదల్లేక పోయాడు. ఏం చేయాలో అర్థంగాక మూడు రోజులు నిద్ర, ఆహారం లేకుండా తారులోనే కూరుకుపోయాడు. బయటకు రాలేక నరకయాతన అనుభవించాడు. మూడు రోజుల తర్వాత అటుగా వెళ్తున్న స్థానికులు కూలీ అరుపులు విని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న రెస్క్యూ టీమ్ చాలా ప్రయత్నాలు చేసింది. ఎంతకీ లాగిన రాలేదు. కింద నుంచి మంట పెడతామంటే మనిషి అందులోనే కరిగిపోతాడని ఆ సాహసం చేయలేదు. కొన్ని గంటలు కష్టపడి రెస్క్యూ టీంతో కలిసి డబ్బాను కట్ చేసి అతడిని బయటకు తీశారు. ఆస్పత్రికి తరలించడంతో కథ సుఖాంతం అయింది.