ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:785

GOLCONDA NEWS | Updated:2024-01-05 21:47:30 IST

యూపీఎస్సీ తరహాలో టీఎస్ పీఎస్సీ

- సభ్యుల నియామకంలో పాలిటిక్స్ ఉండవ్
- ఛైర్మన్ తో పాటు సభ్యులకు ట్రైనింగ్
- యూపీఎస్సీ ఛైర్మన్ తో భేటి అయిన సీఎం
యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ కు సుమారు వందేళ్ల చ‌రిత్ర ఉందని.. సుదీర్ఘ చ‌రిత్ర‌తో పాటు నిర్దిష్ట కాల‌ప‌రిమితిలోనే నోటిఫికేష‌న్‌, ప‌రీక్ష‌లు, ఇంట‌ర్వ్యూల నిర్వ‌హ‌ణ‌, నియామ‌క ప్ర‌క్రియ‌ను చేప‌ట్ట‌డం.. అన్నింటా పార‌ద‌ర్శ‌క‌త పాటిస్తోందని.. తెలంగాణ రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ టీఎస్‌పీఎస్సీ ను ఆ విధంగానే రూపొందించాల‌ని తాము నిర్ణయించుకున్నామని యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఛైర్మ‌న్ డాక్ట‌ర్ మ‌నోజ్ సోనికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. న్యూ ఢిల్లీలోని యూపీఎస్సీ కార్యాల‌యంలో ఛైర్మ‌న్ డాక్ట‌ర్ మ‌నోజ్ సోని, కార్య‌ద‌ర్శి శ‌శిరంజ‌న్ కుమార్‌ల‌తో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీటిపారుద‌ల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా టీఎస్‌పీఎస్సీ ప్ర‌క్షాళ‌న‌, యూపీఎస్సీ ప‌ని తీరుపై సుమారు గంట‌న్న‌ర పాటు వారు చ‌ర్చించారు.
శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న సిబ్బంది
తెలంగాణ‌లో నియామ‌క ప్ర‌క్రియ‌లో నూత‌న విధానాలు, ప‌ద్ధ‌తులు పాటించాల‌నుకుంటున్న‌ట్లు ముఖ్యమంత్రి తెలిపారు. స్పందించిన యూపీఎస్సీ ఛైర్మ‌న్ యువ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నియామ‌కాల ప్ర‌క్రియ‌పై దృష్టి సారించ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. యూపీఎస్సీ ఛైర్మ‌న్‌, స‌భ్యుల నియామ‌కంలో రాజ‌కీయ ప్ర‌మేయం ఉండ‌ద‌ని, స‌మ‌ర్థత ఆధారంగా ఎంపిక ఉంటుంద‌ని తెలిపారు. తాము 2024 డిసెంబ‌ర్ నాటికి రెండు ల‌క్ష‌ల ఉద్యోగ నియామ‌కాలు చేప‌ట్టాల‌ని భావిస్తున్నామ‌ని, ఇందుకు టీఎస్‌పీఎస్సీని ప్ర‌క్షాళ‌న చేయాల‌నుకుంటున్నామ‌ని ముఖ్య‌మంత్రి, మంత్రి ఛైర్మ‌న్ దృష్టికి తీసుకెళ్లారు. గ‌త ప్ర‌భుత్వం టీఎస్‌పీఎస్సీ ఛైర్మ‌న్‌, స‌భ్యుల నియామ‌కాన్ని రాజ‌కీయం చేసి, దానినో రాజ‌కీయ పున‌రావాస కేంద్రంగా మార్చింద‌న్నారు. ఫ‌లితంగా పేప‌ర్ లీకులు, నోటిఫికేష‌న్ల జారీ, ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌, ఫ‌లితాల వెల్ల‌డి ఓ ప్ర‌హ‌స‌నంగా మారింద‌న్నారు.
నీళ్లు, నిధులు, నియామ‌కాలే ల‌క్ష్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాట‌యింద‌ని, కానీ గ‌త ప్ర‌భుత్వ అస‌మ‌ర్థత‌తో నియామ‌కాల విష‌యంలో తీవ్ర నిర్ల‌క్ష్యం చోటు చేసుకుంద‌న్నారు. తామ రాజ‌కీయ ప్ర‌మేయం లేకుండా ఛైర్మ‌న్‌, స‌భ్యుల నియామ‌కం చేప‌డ‌తామ‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు. టీఎస్‌పీఎస్సీలో అవ‌క‌త‌వ‌కల‌కు తావులేకుండా సిబ్బందిని శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న నియ‌మిస్తామ‌ని వివ‌రించారు. టీఎస్‌పీఎస్సీ ఛైర్మ‌న్‌తో పాటు స‌భ్యుల‌కు తాము శిక్ష‌ణ ఇస్తామ‌ని, స‌చివాల‌య సిబ్బందికి అవ‌గాహ‌న త‌ర‌గతులు నిర్వ‌హిస్తామ‌ని యూపీఎస్సీ ఛైర్మన్ తెలిపారు.
స‌మావేశంలో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి, సీఎం ముఖ్య కార్య‌ద‌ర్శి వి. శేషాద్రి, ఓఎస్డీ అజిత్ రెడ్డి, టీఎస్‌పీఎస్సీ కార్య‌ద‌ర్శి అనితా రామ‌చంద్ర‌న్, రాష్ట్ర అట‌వి, ప‌ర్యావ‌ర‌ణ శాఖ ముఖ్య‌ కార్య‌ద‌ర్శి వాణి ప్ర‌సాద్‌ పాల్గొన్నారు.

        Subscribe our Youtube channel
Add Your Comment
No Comments
Recent గా మీరు చదివినవి
Last visit:2024-12-23 00:07:35 IST
యూపీఎస్సీ తరహాలో టీఎస్ పీఎస్సీ share
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498