సాహసం చేయరా ఢింబకా అన్నట్లు భారత దేశ ప్రధాని సాహసం చేసి చూపించారు. దేశంలో ఎంతో మంది యువతరానికి ఆదర్శంగా నిలిచారు. లక్షద్వీప్ లో స్నార్కలింగ్ (సాహసంతో కూడిన స్విమ్మింగ్) చేసినట్లు తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. మంగళ, బుధవారాల్లో లక్ష్యద్వీప్ లో పర్యటన చేసిన ఆయన పలు విషయాలు పంచుకున్నారు. లక్ష్యద్వీప్ ప్రక్రుతి అందాలు , వాతావరణం తనను ఎంతో ముగ్దున్ని చేశాయని.. భారతీయుల సంక్షేమం కోసం మరింతగ ఎంత కష్టపడాలో నేర్చుకున్నానని చెప్పారు. సాహసం చేయాలనుకునే ప్రతి ఒక్కరికి లక్ష్యద్వీప్ వారి లిస్టులో ఉండాలని ఆయన సూచించారు.