డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో అమెజాన్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సమావేశమయ్యారు.. తెలంగాణలో తమ సంస్థ పెట్టుబడుల గురించి సమావేశంలో అమెజాన్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో మరింత పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని సీఎం అన్నారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ , అధికారులు పాల్గొన్నారు.