ఆయోధ్యలో పలు అభివ్రుద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తర ప్రదేశ్ కు కొద్దిసేపటి క్రితమే ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. సీఎం యోగి ఆదిత్య నాథ్ విమానాశ్రయానికి చేరుకుని స్వాగతం పలికారు. శనివారం ఆయోధ్యలో కొత్తగా నిర్మించిన ఎయిర్ పోర్టు.. రైల్వే స్టేషన్ ను ప్రధాని ప్రారంభిస్తారు. రోడ్ షో లో ప్రధాని కారు బయటకు వచ్చి చేయి ఊపుతూ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.