కరీంనగర్ లో భూకబ్జాలకు పాల్పడిన పొలిటికల్ లీడర్లపై ఫిర్యాదులు కమిషనరేట్ కు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గత నెల రోజులుగా పలువురి కార్పొరేటర్లు.. సహా మాజీ మంత్రి గంగుల కమాలకర్ షాడో గా పేరుగాంచిన నందెల్లి మహిపాల్ ను సైతం పోలీసులు జైలుకు పంపించారు. తాజాగా కరీంనగర్ సిటీకి చెందిన మరో ముగ్గురు కార్పొరేటర్లు కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం అందుతుంది. వారి డివిజన్లలో చేస్తున్న భూకబ్జాలపై అందిన ఫిర్యాదులో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. పూర్తి స్థాయిలో విచారించిన తరవాత ఈ రోజు సాయంత్రం కానీ.. రేపు కాని అరెస్టు చూపే అవకాశాలున్నాయి. ఒకవైపు ఎక్కడిక్కడ కేసులు పెట్టి లీడర్లను అరెస్టులు చేస్తుంటే.. మాజీ రౌడీ షీటర్లు మాత్రం చెలరేగిపోతున్నారనే వార్తలు వస్తున్నాయి. సోమవారం కమిషనరేట్ లో జరిగిన ప్రజా దర్బార్ లో మాజీ రౌడీ షీటర్ అనూప్ పై భారీగా ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో సీపీ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.