జనసైనికులకు ఎల్లవేళలా పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 11మంది క్రియాశీలక జనసైనికులు ప్రమాదవశాత్తూ మృతిచెందారు. వారి కుటుంబాలకు అండగా ఉండాలని నిర్ణయించుకున్న పవన్ శనివారం ఆయా కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున మొత్తం రూ. 55 లక్షల విలువగల భీమా చెక్కులు అందించాడు. వారి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఏ కష్టం వచ్చినా.. తాను అండగా నిలుస్తానని వారికి హామీ ఇచ్చారు.