ఫ్రాన్స్ దేశంలో ఉన్న ఇండియన్ విమానం సురక్షితమేనని తెలిసింది. ఫ్రాన్స్‌లోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో చర్చించింది. ఫ్రెంచ్ నిబంధనల ప్రకారం పారిస్‌కు 150 కిలో మీటర్ల దూరంలో ఉన్న వాట్రీ విమానాశ్రయంలో ఈ ఘటనపై న్యాయ విచారణ జరిగింది. నలుగురు న్యాయమూర్తుల ప్యానల్ చేపట్టిన బహిరంగ విచారణ స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. ఓ కంపెనీ క్లయింట్ కోసం విమానాన్ని నడిపామని, మానవ అక్రమ రవాణా ఆరోపణలతో తమకు ఎలాంటి సంబంధం లేదని లెజెండ్ ఎయిర్‌లైన్స్ న్యాయవాది స్పష్టం చేశారు. 303 మందిని విడివిడిగా విచారించాలని భావించిన న్యాయమూర్తులు, అసలు ఈ ప్రక్రియే అస్తవ్యస్తంగా ఉందటూ మొత్తం కేసునే రద్దు చేశారు