అటు దేశ వ్యాప్తంగా.. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ రోజు ఉదయమే కరోనాతో తెలంగాణ రాష్ట్రంలో ఒకరు చనిపోయారు. కాగా 24 గంటల్లోనే 8 కేసులు కొత్తవి నమోదు కావడం భయాందోళనలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కొవిడ్ కొత్త వేరియంట్‌కు సంబంధించి ప్రతిరోజు బులెటిన్ విడుదల చేస్తోంది. ఇవ్వాల్టి బులెటిన్ ప్రకారం... కొత్తగా ఎనిమిది కేసులు నమోదయ్యాయని... ప్రస్తుతం 59 మంది కొవిడ్ చికిత్సను పొందుతున్నారు. ఈ రోజు 1,333 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. మరో ముప్పై మంది రిపోర్టులు రావాల్సి ఉంది.