ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:869

GOLCONDA NEWS | Updated:2024-01-01 11:03:04 IST

నింగిలోకి విజయవంతగా పీఎస్ ఎల్ వీ సీ 58

ఇస్రో కొత్త సంవత్సరమే విజయోత్సహంతో ప్రారంభించింది. ఎక్స్ పో శాట్ ఉపగ్రహాన్ని నింగిలోకి విజయవంతంగా చేర్చింది. సతీష్ ధావన్ సెంటర్ నుంచి పిఎస్ఎల్వి సి 58 వాహన నౌక ద్వారా ఎక్స్ పోలార్ మీటర్ ఉపగ్రహంతో సోమవారం 9:10 గంటల కు నింగిలోకి దూసుకెళ్లింది. ఆదివారం ఉదయం 8:10 నిమిషాలకు ప్రారంభమైన 25 గంటల కౌంట్ డౌన్ ప్రక్రియ అనంతరం మొదటి ప్రయోగ వేదిక నుంచి పిఎస్ ఎల్ వీ రాకెట్ బయలుదేరింది. మన దేశానికి చెందిన 480 కేజీల బరువున్న ఎక్స్పోషాట్ అనే ఉపగ్రహాన్ని నింగిలోకి పంపారు. ప్రయోగం తర్వాత 21 నిమిషాలకు ఎక్స్పో షాట్ నిర్ణీత కక్షలోకి చేరుకుంది. ఇందులో తిరువనంతపురం ఎల్బీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్ కాలేజ్ విద్యార్థినులు తయారుచేసిన హ్యూమన్ ఇంజనీర్డ్ శాటిలైట్ సహా వివిధ ఉపకారణాలు కూడా ఉన్నాయి.
ఎక్స్పోషా ట్ ఇండియా అంతరిక్ష ఆధారిత అంశాల్లో ఎక్స్రే ఖగోళ శాస్త్రంలో పలు పురోగతికి నాంది కానుంది. ఇమేజింగ్ స్టడీస్ కి, స్పెక్ట్రోస్కోపీ పై మెయిన్ గా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఎక్స్ రే ఖగోళ శాస్త్రాన్ని పరిచయం చేస్తుందని ఇస్రో అధికారులు అంటున్నారు . ఎక్స్ రే మూలాలను అన్వేషించడం దీని లక్ష్యమని అధికారులు వివరిస్తున్నారు. ఇలాంటి ప్రయోగం చేయడం అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తర్వాత మనమేనని అధికారులు వెల్లడించారు. అమెరికా లాంటి దేశాలు IXPE వంటి ప్రయోగాలు చేశారని వెల్లడించారు.
చివరి దశలో మరో పది పరికరాలను అంతరిక్షానికి మోసుకెళ్లి నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టారు. దీనిక పోయెమ్ టఅనే పేరు పెట్టారు. పీఎస్ ఎల్ వీ ఆర్బిటల్ ఎక్స్ పర్మెంట్ మాడ్యూల్ () అని పెట్టారు. దీంట్లోనే తిరువనంతపురం కాలేజీ స్టూడెంట్స్ ఎల్ బీఎస్ ఇనిస్టూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ వుమెన్ కాలేజ్ వాళ్లు తయారు చేసింది దీని ద్వారానే పంపించారు.
ఎక్స్ పో శాట్ జీవిత కాలం ఐదు ఏళ్లు. ఇది ముఖ్యంగా బ్లాక్ హోల్స్ వంటి వాటిపైనే ఎక్కువగా పరిశోధనలు చేస్తుంది. న్యూట్రాన్ల స్టార్స్ దగ్గర రేడియేషన్ ను కూడా ఈ ఉపగ్రహం బయట పెట్టనుంది, ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టామని ఇస్రో అధికారులు చెబుతున్నారు. వీటి సాయంతో శాస్త్రవేత్తలు తమదైన రీతిలో ప్రయోగాలు చేసి .. వాటి రిజల్ట్స్ రాబట్టే పనిలో ఉన్నరు.

        Subscribe our Youtube channel
Add Your Comment
No Comments
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498