‘కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ నుంచి పుట్టుకొచ్చిన సబ్ వేరియంటే జేఎన్.1 అంతగా ప్రమాదకారి కాదు. దగ్గు, జలుబు, సాధారణ జ్వరం మాదిరిగానే ఇలా వచ్చి.. అలా వెళ్లిపోతుంది. కొవిడ్-19 ఆర్టీపీసీఆర్ పరీక్ష చేస్తేగానీ తెలియదు. ఇప్పటికే చాలా మందికి ఈ వైరస్ సోకి, కోలుకుని ఉండొచ్చు. ఇటీవలికాలంలో పరీక్షలను పెంచడం వల్లే.. కేసులు వెలుగుచూస్తున్నాయి. జేఎన్.1 పట్ల ఆందోళన అవసరమే లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) కూడా ఈ వేరియంట్ ప్రమాదకారి కాదని స్పష్టం చేసింది. అందుకే.. ఎలాంటి మార్గదర్శకాలను విడుదల చేయలేదని యశోద ఆస్పత్రి సీనియర్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఎంవీ రావు స్పష్టం చేశారు.