ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:713

GOLCONDA NEWS | Updated:2023-12-26 11:15:52 IST

నైజీరియాలో మరో దారుణం

సాయుధ మూకల అరాచక దాడులతో వణికిపోతున్న నైజీరియాలో మరో దారుణం వెలుగుచూసింది. మధ్య నైజీరియాలోని పలు గ్రామాల ప్రజలే లక్ష్యంగా బండిట్స్‌ గా పిలిచే సాయుధ సమూహాలు అరాచక దాడులకు తెగబడ్డాయి. కాల్పులతో నరమేధాన్ని సృష్టించాయి. వరుస కాల్పుల్లో 160 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్టుగా స్థానిక ప్రభుత్వం ప్రకటించింది. ఆదివారం సాయంత్రం జరిగిన కాల్పుల్లో 16 మంది చనిపోయినట్టుగా మొదట వార్తలు వచ్చాయి. అయితే సోమవారం కూడా ఈ కాల్పులు కొనసాగడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. దాడుల్లో గాయపడిన దాదాపు 300 మందికి పైగా బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని స్థానిక అధికారులు వెల్లడించారు.
ఇదిలావుంచితే కొన్ని తెగలకు చెందిన ప్రజలే లక్ష్యంగా సాయుధ మూకలు మారణకాండకు పాల్పడ్డాయని, ఇళ్లలోకి చొరబడి ప్రజలను చిత్రహింసలకు గురిచేశారని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. కాగా మధ్య నైజీరియా కొన్నేళ్లుగా ఈ తరహా దాడులతో వణికిపోతోంది. సామాజిక పరమైన, మతపరమైన విబేధాలు ఘర్షణలకు కారణమవుతున్నాయి. వాయవ్య, మధ్య నైజీరియాలో ఇలాంటి ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. వేల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.

        Subscribe our Youtube channel
Add Your Comment
No Comments
ట్రెండింగ్
Updated:2024-08-31
వర్షానికి కూలిన పాండురంగ ఆలయం        |       257 Reading
Updated:2023-12-30
లోకసభ ఎన్నికలకు బీఆర్ ఎస్ సన్నద్ధం        |       250 Reading
Updated:2023-12-26
నైజిరియాలో నరమేధం        |       172 Reading
Updated:2024-01-02
నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ తో భేటి        |       341 Reading
Updated:2024-01-10
మీరే అమ్మ.. మీరే నాన్న: మహేశ్ బాబు ఎమోషనల్ స్పీచ్        |       411 Reading
Updated:2024-01-10
రాహుల్ యాత్ర కు మణిపూర్ నో పర్మిషన్        |       129 Reading
Updated:2023-12-25
జేెఎన్ .1 అంత డేంజర్ ఏం కాదు        |       351 Reading
Updated:2023-12-22
సిరీస్ మనదే..        |       278 Reading
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498