రాహుల్ గాంధీ మరోసారి యాత్రకు సిద్ధమవుతున్నారు. భారత్ యాత్ర పేరుతో మణిపూర్ నుంచి ముంబై వరకు ఈ యాత్ర కొనసాగుతుంది. యాత్ర పూర్తి షెడ్యూల్ను కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఉదయం రిలీజ్ చేసింది. అయితే మునుపటిలా కాకుండా ఈసారి రాహుల్ గాంధీ యాత్రను బస్సులో చేస్తారని వెల్లడించారు. 14 రాష్ట్రాల్లోని 85 జిల్లాల గుండా ఈ యాత్ర సాగుతుంది. మొత్తం 6200 కిలోమీటర్ల మేరకు ఈ యాత్ర చేపట్టే అవకాశాలు ఉన్నాయి.