తన మీద తెలియకుండా తప్పులు రాతలు రాస్తే ఊరుకునేది లేదు.. ఇక నుంచి ఎవరైనా సరే వారి తాట తీస్తా అంటూ నిర్మాత దిల్ రాజ్ ఫైర్ అయ్యారు. ఇటీవల కాలంలో దిల్ రాజు పై వివిధ మీడియాల్లో వస్తున్న వార్తలపై ఆయన ఘాటుగా స్పందించారు. ఓ సినిమా ఫంక్షన్ లో నటుడు చిరంజీవి దిల్ రాజుపై మాట్లాడిన మాటలను వక్రీకరించారని ఆవేదన చెందారు. ప్రతి సంక్రాంతికి తనను కావాలనే టార్గెట్ చేస్తున్నారని అన్నారు. ఎంతో కష్టపడి రవితేజను ఒప్పించి ఆయన సినిమా సంక్రాంతికి కాకుండా మార్చామని దిల్ రాజు చెప్పారు. ప్రస్తుతం నాగర్జున, వెంకటేశ్ వంటి సూపర్ స్టార్ సినిమాలకే థియేటర్లు దొరకని పరిస్థితి ఉందన్నారు. తానేదో తమిళ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు రాశారని.. మీ దగ్గరేమైనా ఫ్రూఫ్ లున్నాయా అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హనుమాన్ సినిమాను కూడా పండక్కి కాకుండా ఆ తరవాత చేసుకోమని రిక్వెస్ట్ చేశామన్నారు. ఏదైనా పూర్తిగా తెలిస్తేనే రాయాలని.. లేని పక్షంలో ఇక నుంచి ఊరుకునేది లేదంటూ మండిపడ్డారు.