శనివారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో మహారాష్ట్ర మాంగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయ్‌ఘడ్‌లోని తమ్హాని ఘాట్ ప్రాంతంలో ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, 55 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సంఘటనపై విచారణ చేస్తున్నట్లు రాయగడ ఎస్పీ సోమనాథ్ ఘర్గే వెల్లడించారు.