అయోధ్య విమానాశ్రయం ప్రారంభోత్సవం కోసం ప్రధాని మోదీ అయోధ్య పర్యటన చేయనున్నారు. ఈ పర్యటన విశేషాలపై యూపీ మంత్రి జైవీర్ సింగ్ ఏఎన్ఐ తో మాట్లాడుతూ.. రేపు ఉత్తరప్రదేశ్ ప్రజలకే కాదు.. సనాతన ధర్మాన్ని విశ్వసించే వారందరికీ... అయోధ్య.. శ్రీరాముని మూర్తిమత్వంతో మన సంస్కృతికి కొత్త కోణాలను అందించిన మహర్షి వాల్మీకి పేరు మీద విమానాశ్రయానికి నామకరణం చేస్తున్నారు...అయోధ్యధామ్ రైల్వే స్టేషన్‌ను కూడా రేపు ప్రారంభించనున్నారు.దీనిలో పలు రైళ్లకు జెండా ఊపి.. వేల కోట్ల ప్రాజెక్టులు రేపు ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని చెప్పారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.