తాను నటించే రోజుల్లో అందరం బిజీగా ఉన్నా.. రోజాతోనే ఎక్కువగా పోటీ ఉండేదని హీరోయిన్ మీనా చెప్పారు. ఈ మధ్య ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. రోజా .. రమ్యకృష్ణ .. రంభ కూడా చాలా బిజీ.. వాళ్లలో రోజాతో నాకు ఎక్కువగా పోటీ నడిచేదని.. డేట్స్ లేని కారణంగా రోజా వదులుకున్న సినిమాలు తను, తను వదిలేసిన సినిమాలు రోజా చేస్తూ ఉండేవాళ్లమని చెప్పారు. ఇప్పటికీ వాళ్లందరితో తనకు మంచి స్నేహం ఉందని... తనకు ముందు నుంచి ఉన్న సీనియర్ హీరోయిన్స్ తోను స్నేహం కొనసాగుతూ ఉండటం అదృష్టమని ఆమె చెప్పుకొచ్చారు.