గుంటూరు కారం శుక్రవారం ప్రిమీయర్ షో చూసిన వాళ్ల నుంచి పబ్లిక్ టాక్ అయితే వచ్చింది. ఈ సినిమాలో మహేశ్ బాబు.. శ్రీలీల జంటగా త్రివిక్రమ్ డైరెక్ట్ చేశారు. పెద్ద డైరెక్టర్ అని నమ్మి వచ్చిన మహేశ్ బాబుకు కాస్త నిరాశే మిగిల్చిందని సినీ అభిమానులు అంటున్నారు. ఒక చిన్న లైన్ ను తీసుకుని కథంతా సాగదీశారని కొందురు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా మహేశ్ బాబు డ్యాన్స్ ఇరగదీశారనే టాక్ వచ్చింది. కేవలం మహేశ్ బాబు మాత్రమే సినిమా అంతా భుజాల మీద మోసుకొచ్చాడని చెబుతున్నారు. శ్రీలీలను హీరోయిన్ గా పెట్టుకున్న.. సరైన విధంగా రోల్ ఇవ్వకపోవడం మైనస్ అంటున్నారు ప్రేక్షకులు. గతంలో ఆదికేశవ వంటి సినిమాల్లో కూడా కేవలం గ్లామర్ కోసమే తీసుకోవడం వల్ల పెద్దగా ఒరిగిందేమి లేదని.. ఈ సినిమాలో కూడా అదే పరిస్థితి అయిందంటున్నారు. మహేశ్ లుంగి కట్టుకుని ఉంటే.. శ్రీలీల వచ్చి లుంగి లాగేస్తే కేవలం షార్ట్ మీదనే హీరో ఉండటం వంటి సీన్లు ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తాయంటున్నారు. ఫైట్లు క్లియర్ గా చూపించారని.. క్లైమాక్స్ 10 నిమిషాలు బాగుందని అంటున్నారు. ఓవరాల్ గా ఆడియన్స్ ఇచ్చే రేటింగ్ 2 నుంచి 2.5 అంటున్నారు.