గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో మహేశ్ బాబు ఎమోషనల్ అయ్యారు. తన స్పీచ్ లో ఫాదర్ కృష్ణ గురించి మాట్లాడుతూ .. తన సినిమా రికార్డుల గురించి మాట్లాడానికి ఇప్పుడు నాన్న తనతో లేరని.. ఇకపై మీరే అమ్మ నాన్న అంటూ ఎమోషనల్ అయ్యారు. అభిమానులంతా మేమున్నామనే సంకేతాలు ఇస్తూ జేజేలు పలికారు. మంగళవారం రాత్రి ఈ ఇవెంట్ గుంటూరులోనే జరిగింది. మూవీ టీమ్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ ప్రీ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా హీరోయిన్లు మీనాక్షి చైదరి, శ్రీలీలలు నిలిచారు. కలరింగ్ అదిరిపోయింది. శ్రీలీల అయితే నల్లని గల్ల చీర కట్టుకుని వచ్చి కుర్రకారుకు మత్తెక్కించింది. మీనాక్షి సైతం కలర్ ఫుల్ గా క్యూట్ గా కనిపించింది. మొత్తంగా ఈవెంట్ అంతా కలరింగ్ గా సాగిందనే చెప్పాలి.