రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తో కలిసి ప్రధాని నరేంద్ర మోడిని కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తరవాత తొలిసారి భేటి కావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై వారు చర్చించినట్లుగా తెలుస్తోంది. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులు సహా వివిధ అంశాలపై సీఎం, డిప్యూటీ సీఎం... ప్రధానికి ఓ నివేదిక ఇచ్చారని సమాచారం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరవాత ప్రధానితో భేటి కావడం సర్వత్రా ఆసక్తి నెలకొంది.