రవి బస్రూర్ స్వరపరిచిన ఈ పాటకి కృష్ణ కాంత్ సాహిత్యాన్ని అందించాడు. విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమాకి, ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడు. కథ నేపథ్యం .. హీరో ఫ్యామిలీ అనుభవిస్తున్న వేదనను ఆవిష్కరిస్తూ ఈ పాట సాగుతుంది. హీరో .. అతని తల్లి .. ప్రియురాలు ముగ్గురూ భారమైన మనసులను ఈ పాట టచ్ చేస్తూ వెళుతుంది. టైటిల్ దగ్గర నుంచి ఈ సినిమా అందరిలో అంచనాలను పెంచుతూ వెళ్లింది. అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలోనే ఈ సినిమా కొత్త రికార్డును సృష్టించిందంటే, ఏ స్థాయిలో ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారనేది అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాతో మలయాళం నుంచి పృథ్వీ రాజ్ సుకుమారన్ పరిచయమవుతున్నాడు.