ఓ యువతి అతి తెలివి జైలు పాలయ్యేలా చేసింది. తనను ప్రేమించిన మాజీ ప్రియుడిని ఎలాగైనా జైలుకు పంపించాలని ప్లాన్ చేసినా.. అది తనకే రివర్స్ అయి తానే ఇప్పుడు జైల్లో కూర్చుంది. వివరాల్లోకి వెళితే.. హైదరబాద్ రహమత్ నగర్ కు చెందిన రింకీ హైదరాబాద్ లోని ఓ ఫైనాన్స్ కంపెనీలో చేస్తుంది. సరూర్ నగర్ కు చెందిన శ్రావణ్ అనే యువకుడు అదే ప్రాంతంలో పని చేస్తాడు. వీరిద్దరు ప్రేమించుకున్నారు. కొంత కాలం నుంచి శ్రావణ్ రింకిని దూరం పెడుతున్నాడు. దీంతో శ్రావణ్ పై రింఖీ కక్ష పెంచుకుంది. ఎలాగైనా జైలుకు పంపించాలని నిర్ణయం తీసుకుంది. బయట వ్యక్తుల నుంచి గంజాయి కొని.. తన స్నేహితుల ద్వారా శ్రావణ్ కు కాల్ చేసి అమీర్ పేటలోని ఓ పార్కు వద్దకు రప్పించింది. ఫ్రెండ్స్ తో కలిసి పబ్ కు వెళ్లారు. రింకీ తనకు తెలిసిన కానిస్టేబుల్ కు కాల్ చేసి.. శ్రావణ్ అనే వ్యక్తి గంజాయి అమ్ముతున్నాడు.. ఫలానా కారులో ఉన్నాయని వివరాలు చెప్పింది. దీంతో పోలీసులు శ్రావణ్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఫ్రెండ్స్ కారులో వచ్చానని.. కారు తనది కాదని చెప్పడంతో పోలీసులు ఫ్రెండ్స్ ను తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. రింకీతో పాటు ఆమెకు సహకరించిన ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు.