కుఫోస్ యూనివర్సిటీలో స్డూడెంట్స్ వేడుకలు
ఉట్టిపడిన కేరళ సంప్రదాయాలు
వేడుకల్లో తెలుగు విద్యార్థుల హవా
గోల్కొండ న్యూస్ , ఇంటర్నెట్ డెస్క్ :
ఓనం పండుగను పురస్కరించుకొని మలయాళీ సోదర, సోదరీమణులు ఘనంగా ఓనమ్ పండుగ జరుపుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగానే కేరళ రాష్ట్రంలోని పనాన్ ఘడ్ కొచ్చి లోని కుఫోస్ యూనివర్సిటీలో స్డూటెండ్స్ ఓనమ్ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. అందంగా పూవులతో ముగ్గులు అలంకరించారు. అబ్బాయిలు ముండ్ (పంచెలు) కట్టుకుని రాగా.. అమ్మాయిలు కేరళ సంప్రదాయ చీరలు వేసుకుని కాలేజీలో హంగామా చేశారు. మిఠాయిలు పంచుకున్నారు. సాయంత్రం వేళలో వివిధ రకాలైన సరదా ఆటలు ఆడుకున్నారు. యూనివర్సిటీ ప్రోఫెసర్లు డా.అనుగోపీనాథ్, డా. అన్వర్ ఆలీ, డా. ఆర్య , అఖిలాండేశ్వరీ , సేధులక్ష్మీ ఈ కార్యక్రమంలో పాల్గొని స్టూడెంట్స్ కు శుభాకాంక్షలు చెప్పారు. తెలుగు స్టూడెంట్స్ విష్టువర్ధన్ , శరత్ చంద్ర, చిన్నిక్రిష్ణ, సాగర్, జ్యోతిరామ్, హరిక్రిష్ణ , మణిదీప్తీ, సౌందర్య తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ, సాంస్కృతిక వేడుకైన ఈ ఓనం పండుగ వయనాడ్ విపత్తు నుంచి కోలుకుంటోన్న మలయాళీ కుటుంబాల్లో తిరిగి సంతోషాలు నింపాలని తన సందేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.