కరీంనగర్ లో ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడిచేసిన ఘటన కలకలం రేపుతుంది. కరీంనగర్ నగర శివార్లలోని కొత్తపల్లిలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రాథమిక సమాచారం మేరకు 24 ఏండ్ల యువతిని ఓ యువకుడు ప్రేమిస్తున్నానంటూ గత కొద్ది రోజేలుగా వెంట పడుతున్నాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి సదరు యువతిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో యువతి తలకు.. చేతికి తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం అవుతున్న యువతిని స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కొత్తపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.