మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు మన కరీంనగర్ స్పెషల్ వంటకం అయిన సర్వపిండి భలే నచ్చింది. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొనేందకు కరీంనగర్ జిల్లాకు విచ్చేసిన ఆయన మంగళవారం సాయంత్రం మానకొండురు నియోజకవర్గంలోని కొండ పలక ఎంపీటీసీ, బీజేపీ కార్యకర్త గుర్రాల వెంకటరెడ్డి నివాసానికి వచ్చారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ తో కలిసి వెంకట రెడ్డి కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. కుటుంబ సభ్యుల పరిస్థితిపై ఆరా తీశారు. వారితో కలిసి టీ తాగారు. కరీంనగర్ స్పెషల్ అయిన సర్వపిండిని బండి సంజయ్ తో కలిసి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరగించారు. సర్వపిండి చాాలా బాగుందంటూ మెచ్చుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగారు. శివరాజ్ సింగ్ చౌహాన్ రాకను పురస్కరించుకుని పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చారు. అందరితో కాసేపు కలివిడిగా గడిపారు.