విజయరాజ్ అలగర్‌స్వామి విజయకాంత్ గా సుపరిచితుడు. అనారోగ్యంతో చికిత్సపొందుతూ 71 ఏళ్ల విజయకాంత్ చెన్నైలోని మియోట్ ఆస్పత్రిలో 2023 డిసెంబరు 28న తుదిశ్వాస విడిచాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
అతను రాజకీయ నాయకుడు, సినిమా నటుడు. తమిళ సినిమా రంగంలో పనిచేశాడు. DMDK రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి కూడా. అతను తమిళనాడు శాసనసభలో 2011 నుండి 2016 వరకు ప్రతిపక్ష నాయకునిగా ఉన్నాడు. రాజకీయాలలోకి చేరక ముందు అతను సినిమా నటుుడు, నిర్మాత, దర్శకుడు. అతను ప్రస్తుతం దేశీయ ముర్పొక్కు ద్రవిడ కఝగం పార్టీ ఛైర్మన్ గా ఉన్నాడు. అతను విరుధచలం, రిషివేందియం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. విరుధాచలం, రిషివండియం నియోజకవర్గం నుండి వరుసగా రెండుసార్లు శాసనసభ సభ్యునిగా పనిచేశాడు.