నాంపల్లి స్టేషన్ లో చార్మినార్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న ఈ ట్రైన్ నాంపల్లి స్టేషన్ కు చేరుకుంటున్న సమయంలో పట్టాలు తప్పడంతో ఫ్లాట్ ఫాం గోడలను ఢికోట్టింది. దీంతో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని లాలాగూడ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ట్రైన్ అప్పటికే వేగం తక్కువ కావడంతో ప్రమాదం తప్పింది. లేకుంటే భారీ ప్రాణ నష్టమే జరిగేదని స్థానికులు అంటున్నారు. ప్రమాద ఘటనపై పూర్తి విచారణ చేపడుతున్నామని.. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని సీపీఆర్వో తెలిపారు. ఎక్కువ మంది సికింద్రాబాద్ స్టేషన్ లో దిగిపోవడం.. రైలు వేగం తక్కువగా ఉండటం ప్రమాద తీవ్రతను తగ్గించాయని అన్నారు.