150 సంవత్సరాల పురాతన పాండురంగ దేవాలయం శిథిల అవస్థకు చేరింది. ఈ పరిస్థితుల్లో నిన్న కురిసిన వర్షానికి స్లాబ్ పై కప్పు , గోడలు పాండురంగ దేవునిపై విరిగిపడినాయి. ఈ విషయం పుర ప్రముఖులతో తెలుసుకొన్న నగరసేవకుడు కార్పొరేటర్ భర్త సోహన్ సింగ్ , తన బాల్య మిత్రుడు వెంకన్న కలిసి శిథిలాలు తీసే ప్రయత్నం చేశారు. మున్సిపల్ కమిషనర్ దృష్టిలో వేయడం జరిగినది. మున్సిపల్ ట్రాక్టర్లు , ప్రైవేట్ ట్రాక్టర్లతో ఈ శిథిలాలను జరిపించారు. కార్యక్రమంలో పుర ప్రముఖులు కూడా శిథిలాలు జరపడంలో పాల్గొన్నారు. మున్సిపల్ అధికారులు సైతం దీన్ని బాగు చేయాలని వారు కోరుతున్నారు.