ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:834

GOLCONDA NEWS | Updated:2023-12-30 14:23:20 IST

లోకసభ ఎన్నికలకు బీఆర్ ఎస్ సన్నద్ధం

  • వచ్చే నెల మూడు నుంచి సన్నాహక సమావేశాలు

  • తెలంగాణ భవన్ వేదికగా ముఖ్యనేతలతో వరుస భేటీలు

పార్లమెంట్ ఎన్నికల కోసం భారత రాష్ట్ర సమితి పూర్తి స్థాయిలో సమయత్తమవుతుంది. ఇందులో భాగంగా జనవరి మూడో తేదీ నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహించనున్నది. బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్ వేదికగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు, మాజీ స్పీకర్ మధుసూధనాచారి, మాజీ మంత్రులు తదితర ముఖ్య నాయకులు ఈ సమావేశాలను నిర్వహించనున్నారు.
రెండు విడతల్లో
రెండు విడతల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. జనవరి 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు తెలంగాణ భవన్ లో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు కొనసాగుతాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో... మధ్యలో మూడురోజుల విరామమిచ్చి, మిగిలిన నియోజకవర్గాల సన్నాహక సమావేశాలను సంక్రాంతి తరువాత పార్టీ కొనసాగనున్నాయి. మొదట జనవరి 3న ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంతో ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఈ సమావేశాలకు ఆయా పార్లమెంట్ పరిధిలోని ముఖ్యులందరినీ ఆహ్వానిస్తున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల ఎంపీలు, నియోజకవర్గం పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మేయర్లు, మాజీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇంచార్జీలు, జిల్లా పార్టీ అద్యక్షులు మొదలుకొని పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు సమావేశాలకు హాజరవుతారు.
పటిష్ట కార్యాచరణ దిశగా.. తెలంగాణ భవన్ లో జరిగే ఈ సమావేశాల్లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. మీటింగ్ కు హాజరయ్యే ముఖ్యనేతల అభిప్రాయాలు తీసుకుని పటిష్టమైన కార్యాచరణను రూపొందించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం స్వల్ప ఓట్ల శాతం తేడాతోనే అనేక సీట్లు చేజారిన నేపథ్యంలో.. వాటిపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా జరగబోతున్న ఈ సమీక్షల అనంతరం ప్రజాక్షేత్రంలో ప్రచార పర్వాన్ని బలంగా నిర్వహించేందుకు కూడా పార్టీ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. తేదీల వారీగా సన్నాహాక సమావేశాల వివరాలు
• 3న ఆదిలాబాద్
• 4న కరీంనగర్
• 5న చేవెళ్ల
• 6న పెద్దపల్లి
• 7న నిజామాబాద్
• 8న జహీరాబాద్
• 9న ఖమ్మం
• 10న వరంగల్,
• 11న మహబూబాబాద్
• 12న భువనగిరి
సంక్రాంతి అనంతరం..
• 16న నల్గొండ
• 17న నాగర్ కర్నూల్
• 18న మహబూబ్ నగర్
• 19న మెదక్
• 20న మల్కాజ్ గిరి
• 21 సికింద్రాబాద్ మరియు హైదరాబాద్

        Subscribe our Youtube channel
Add Your Comment
No Comments
ట్రెండింగ్
Updated:2023-12-25
అటల్ కు ఘన నివాళి        |       225 Reading
Updated:2023-12-27
రేషన్ కార్డు ఉంటేనే స్కీమ్ లు        |       267 Reading
Updated:2023-12-24
కలెక్టర్లు.. ఎస్పీలతో సీఎం సమీక్ష        |       386 Reading
Updated:2024-01-10
రాహుల్ యాత్ర కు మణిపూర్ నో పర్మిషన్        |       408 Reading
Updated:2024-09-15
కేరళలో ఓనమ్ కోలాహలం        |       326 Reading
Updated:2023-12-26
ప్రధానితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ        |       341 Reading
Updated:2024-01-01
ఓన్ స్టైల్ సీఎం.. రేవంత్ రెడ్డి        |       499 Reading
Updated:2023-12-22
జాగ్రత్త లేకుంటే అంతే సంగతి..        |       188 Reading
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498