సఫారీల గడ్డ మీద భారత్ మరో వన్డే సీరీస్ గెలచింది. పార్ల్ వేదికగా సౌత్ ఆఫ్రికాలో జరిగిన కీలక పోరులో టీమ్ ఇండియా చక్కని ఆట ఆడి 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకున్నారు. భారత్ తొలుత బ్యాటింగ్ చేసి.. 296 రన్స్ చేశారు. 297 రన్స్ లక్ష్యంతో సౌతాఫ్రికా టీమ్ బరిలో్కి దిగి కేవలం 218 రన్స్ కే ఆలౌట్ అయ్యారు. శాంసన్, తిలక్ వర్మలు శతకం, అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు.