సీఐటీయూ, రైతు సంఘాల నేతల చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లిన ఘటన తీవ్ర దుమారం రేపుతుంది. జగిత్యాల జిల్లాలో కార్మికులకు,పేద ప్రజలకు ఇండ్లు, ఇళ్ళ స్థలాలు కావాలని భూపోరాటo చేస్తున్న జగిత్యాల జిల్లా సీఐటీయూ, ప్రజా సంఘాల నాయకులను అక్రమ కేసులు నమోదు చేసి గత 15 రోజుల కిందట కరీంనగర్ జిల్లా జైలులో పెట్టారు. మంగళవారం జగిత్యాల కోర్టు పేషీ నిమిత్తం సీఐటీయూ,రైతు సంఘాల నాయకులు లెళ్ళల బాలకృష్ణ,G.తిరుపతి నాయక్ ,రమేష్ లను బేడీలు వేసి తీసుకెళ్లటం చాలా దుర్మార్గం అని కరీంనగర్ CITU జిల్లా అధ్యక్షుడు,ప్రధాన కార్యదర్శి ముకుంద రెడ్డి,ఎడ్ల రమేష్ ఆరోపించారు. న్యాయ శాస్త్ర చట్టం ప్రకారము కోర్టులో నిందితులు క్రిమినల్ ఖైదీగా నిర్ధారించిన వారికి మాత్రమే బేడీలు వేసి కోర్టులకు తరలించాలని నిబంధనలు ఉన్నాయన్నారు. దొంగలు, క్రిమినల్ కేసులు నమోదు అయిన వారు కాదని... ప్రజల కోసం నిత్యం పనిచేసే ప్రజా సంఘాల నాయకులను బేడీలు వేయటం చట్ట విరుద్ధమని అన్నారు.
తమ స్వార్థం కోసం కాకుండా పేద ప్రజలకు నిరంతరం హక్కుల కోసం పోరాటం చేస్తున్న వారికి బేడీలు వెయ్యడాన్ని తీవ్రంగా ఖండించారు. ఉద్యమాలు చేస్తున్న ఎక్కడ బేడీలు వేసి కోర్టు కి హాజరు పరిచిన చరిత్ర లేదని.. ప్రజాస్వామ్యo మా జన్మ హక్కు అని గొప్పలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండు నెలలు పూర్తి కాకముందే ప్రజా సంఘాల నాయకులను అణిచి వేసేందుకు రంగం సిద్దం అయినట్లు తెలుస్తోందన్నారు.ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో చెయ్యాల్సిన పని అని.. ఇందిరమ్మ రాజ్యమని.. దీన్ని ప్రజాస్వామ్య వాదులందరూ,ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించాలని కోరారు. వెంటనే బేషరతుగా ప్రజా సంఘాల నాయకులు క్షమాపణలు చెప్పి వెంటనే విడుదల చేయాలని, బేడీలు వేసిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో రాష్ట్రవ్యాప్తంగా,జిల్లావ్యాప్తంగా ఈ సంఘటనపై నిరసన కార్యక్రమాలు ఉదృతంగా చేస్తామని హెచ్చరించారు.