తెలంగాణ రాష్ట్ర ప్రజలు చలికి గజగజ వణికి పోతున్నారు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సోమవారం రాత్రి రాష్ట్రంలో అత్యంత కనిష్టంగా 8.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. సంగారెడ్డి ఆదిలాబాద్ లోను కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ రంగారెడ్డి మెదక్ సిద్దిపేట మంచిర్యాల జగిత్యాల నిర్మల్ జిల్లాల్లోనూ 15 కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ దట్టమైన పొగ మంచు కారణంగా చాలా చోట్ల రోడ్లపై ప్రయాణించే వాహనాలకు ఇబ్బందిగా మారింది. పలుచోట్ల యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి.