- అప్పులు.. హామీలు ఎట్లా తీరుస్తరు..?
- కాంగ్రెస్ కు సూటి ప్రశ్న
- బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్
ఖర్చులేని హామీలేమయ్యాయి..?
ఎన్నికల్లో పైసా డబ్బుల్లేకుండా అమలు చేసే అవకాశాలున్న హామీలు చాలా ఉన్నాయని.. వాటిని ఎందుకు అమలు చేయడం లేదు? ఉదాహరణకు 317 జీవోను సవరణ.. ఎందుకు అమలు చేయడం లేదన్నారు. డ్రగ్స్ కేసు.. ఇంటర్ విద్యార్థుల జీవితాలతో ఆడుుకున్న గ్లోబరినా కేసు.. టీఎస్ పీఎస్సీ లీకేజీ కేసులు ఎటు పోయాయని బండి నిలదీశారు. అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై సీబీఐ విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారని.. ఈ విషయాన్ని ప్రస్తావించిన కిషన్ రెడ్డిపై ఎందుకు మందలా మాటల దాడి చేస్తున్నారన్నారు. నయీం ఎన్ కౌంటర్ సమయంలో అక్రమాస్తుల డాక్యుమెంట్లు లారీల కొద్దీ ఉన్నాయని, పెద్ద ఎత్తున డబ్బులు స్వాధీనం చేసుకున్నామని పోలీసులే వెల్లడించారు.. ఈ కేసు విచారణ ఏమైందని అన్నారు. వీటన్నింటికి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఉందన్నారు. లేకుంటే ప్రజల విశ్వాసం కాంగ్రెస్ కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.
బీజేపీ వర్సెస్ కాంగ్రెస్
పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీకి మధ్య జరిగేవని.. బీఆర్ఎస్ కు ఓటేస్తే డ్రేనేజీలో వేసినట్లేనని అన్నారు. తెలంగాణ నుండి ఎక్కువ మంది బీజేపీ ఎంపీలను గెలపించాలని.. గతంలో బీఆర్ఎస్ ను గెలిపిస్తే... కేంద్రంతో సఖ్యత లేకుండా నిధులను దారి మళ్లించిన బీఆర్ఎస్ రాష్ట్రానికి అన్యాయం చేసిందనే వాస్తవాన్ని ప్రజలు గమనించారన్నారు. ఇపుడు తెలంగాణ ప్రజలంతా బీజేపీవైపు మొగ్గు చూపుతున్నారన్నారు. బీజేపీ ఎంపీలను గెలిపిస్తే కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి నిధులు తీసుకొచ్చి.. తెలంగాణను సమగ్రాభివ్రుద్ధి చేస్తామన్నారు.