సోనియా గాంధీ పేరిట ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. గమ్మతైన విషయం ఏంటంటే ఈ దరఖాస్తులో వివరాల్లో కొడుకులుగా రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ పేర్లు రాశారు. కూతురుగా కొండా సురేఖ పేరు.. అల్లుడిగా శ్రీధర్ బాబు పేర్లు రాశారు. అకతాయిలు ఎవరో ఇలా రాసి సోషల్ మీడియాలో పెట్టి ఉంటారని అందరు చర్చించకుంటున్నారు. దాన్ని చూసి సరదాగా నవ్వుకుంటున్నారు.