బీఆర్ఎస్ పార్టీకి చెందిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. ఓఆర్ఆర్‌పై ఆమె ప్రయాణిస్తోన్న కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత అక్కడిక్కకడే మృతి చెందారు. ఆమె పీఏతో పాటు కారు డ్రైవర్ తీవ్ర గాయాలపాలయ్యారు. కాగా, ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. దివంగత కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కూతురే లాస్య నందిత. గతేడాది సాయన్న అనారోగ్యంతో కన్నుమూయగా.. సరిగ్గా ఏడాది పూర్తవ్వగానే నందిత దుర్మరణం పాలవడం వారి కుటుంబ సభ్యులను కలిచివేస్తుంది. వారంతా తీవ్ర విషాదంలో ఉన్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గద్దర్ కూతురు వెన్నెలపై కంటోన్మెంట్ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
విధిరాతను తప్పించలేకపోయింది ..
లాస్య నందితకు ఈ మధ్యకాలంలోనే రెండు సార్లు ప్రాణాలనుంచి బయటపడి గండం గట్టెక్కింది. రెండు నెలల కిందట ఒక ప్రోగ్రామ్ కు వెళ్లిన ఎమ్మెల్యే లాస్య లిఫ్ట్ లో ఇరుక్కుపోయింది. సుమారుగా గంట పాటు అందులోనే నరకం అనుభవించింది. ఆ తరవాత ఇటీవల నల్లగొండ కేసీఆర్ సభకు వెళ్లి తిరిగి వస్తుండగా.. లాస్య కారును మరో వాహనం వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో ఆమె కారు ముందుకు దూసుకెళ్లి ఒక హోం గార్డు అక్కడిక్కడే చనిపోయాడు. రెండు సార్లు గండాల నుంచి తప్పించుకున్నా.. ఈ సారి రోడ్డు ప్రమాదరూపంలో యువ ఎమ్మెల్యేను బలితీసుకుంది.