- రూ. 4 కోట్ల భూమి
- 10 ఏండ్ల నుంచి పోరాడుతున్న
గ్రామ భుమిని కాపాడాలంటూ ఏకంగా సర్పంచి కలెక్టర్ ఫిర్యాదు చేయడం విశేషం. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్ రావు పేట గ్రామంలో సర్వే నంబర్ 792 /A లో 2.13 ఎకరాల భూమి ఉంది. దీని విలువ సుమారుగా రూ. 4 కోట్లు పలుకుతుంది. దీన్ని కాపాడాలని.. గ్రామానికి చెందేలా చూడాలని స్వయంగా గ్రామ సర్పంచి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్నరెడ్డి సోమవారం కరీంనగర్ లోని కలెక్టరేట్ లో ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. గత పదేండ్ల నుంచి ఈ భూమి కోసం కొట్లాడుతుంటే బీఆర్ ఎస్ ప్రభుత్వం తనపై ఎస్పీ, ఎస్టీ కేసులు పెట్టించిందని.. ఆ టైమ్ లో తాను కాంగ్రెస్ సర్పంచి కావడంతోనే సపోర్టు చేయ లేదని ఆమె ఆరొపించారు. ఇప్పటికైనా గ్రామ పేద ప్రజలకు అందేలా చూడాలని ఆమె కలెక్టర్ ను కోరారు.