పసుల క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ప్రొడక్షన్ మేనేజర్ రామోజు సంగీత పుట్టినరోజు పురస్కరించుకొని స్థానిక గిద్దెపెరుమళ్ళ ఆలయంలో గోశాలలో ఆవులకు ఆహారం అందించి మూగజీవులైన ఆవులను దర్శించుకొని ఆలయంలో పూజలు చేశారు. అనంతరం స్థానిక వెంకటేశ్వర ఆలయం ముందు ఉన్న యాచకులకు పండ్లు అందించారు. ఈ సందర్భంగా సంగీత మాట్లాడుతూ సామాజిక సేవకులు పసుల రవికుమార్ చేస్తున్న సామాజిక సేవలను చూసి తాను కూడా సామాజిక సేవలు చేయడానికి ముందుకు వచ్చానన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా గోశాల దర్శించుకోవడం జరిగిందన్నారు. జన్మదిన వేడుకలు ఆర్పాటంగా కాకుండా అనాధలకు యాచకులకు ఆహారం అందించి వాళ్లకు ఆకలిని తీర్చినప్పుడే నిజమైన జన్మదిన వేడుకగా జరుపుకోవాలని, ఒకరిని చూసి ఒకరు అనాథలకు సహాయ సహకారాలు అందించాలి ఆమె అన్నారు.