తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే కారణం ఉద్యమకారులే అని జంగాలపల్లి కుమార్ అన్నారు. గురువారం కరీంనగర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారులంతా ఐక్యంగా ఉండాలని.. ఇందుకు సంస్థాగతంగా బలోపేతం చేస్తున్నామని అన్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కరీంనగర్ నియోజకవర్గం ఇన్చార్జిగా జంగాలపల్లి కుమార్ నియామకం అయినట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కరీంనగర్ నియోజకవర్గం ఇన్చార్జిగా నియమించినందుకు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీకి , జిల్లా చైర్మన్ కి కృతజ్ఞతలను కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైర్మన్ కుమారస్వామి, మహిళా నాయకురాలు అయునేని ప్రసన్న, ఉండాలా శ్రీనివాస్ డాక్టర్ రాజేశ్వర్ పాల్గొన్నారు.