జనగామ:
గురువారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎల్బీ స్టేడియంలో గురుకుల టీచర్ల అభ్యర్థులకు ఉద్యోగ నియామకపత్రాలను అందజేయనున్న నేపథ్యంలో జిల్లా నుంచి ఎంపికైన (20) మంది అభ్యర్థులను ప్రత్యేక బస్సులో హైదరాబాదుకు తరలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో జెడ్పీ సీఈవో అనిల్ కుమార్ అభ్యర్థులతో కూడిన బస్సును జెండా ఊపి ప్రారంభించారు. వారితో పాటు జిల్లా స్థాయి అధికారులు సైతం వెళ్లినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఏవో వినోద్ కుమార్, చేనేత & జౌళీ శాఖ ఏడీ చౌడేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.