- జిల్లా హెడ్ క్వార్టర్ మున్సిపాలిటీలోనే డిప్యూటేషన్ అధికారులా..?
- బడ్జెట్ మీటింగ్ లో నిలదీసిన కౌన్సిలర్లు
- అంకెలు మార్చి గారడి చేస్తున్నరంటూ విమర్శలు
• రూ.27.43 కోట్లకు ఆమోదం
జనగామ:
పేపర్ల మీదనే అంకెలు మార్చి కొత్త బడ్జెట్ గా చూపించారు.. పెరిగిన బడ్జెట్ కు నిధులు ఎక్కడి నుంచి వస్తాయనే వివరాలు లేవు. పట్టణంలో ప్రధాన అభివృద్ధి పనుల ఊసే లేదు. తూతూ మం త్రంగా సమావేశం ఏర్పాటు చేసి మమ అనిపిస్తు న్నారంటూ సభ్యులు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. గురువారం మున్సిపల్ చైర్ పర్సన్ పి.జమున లింగయ్య అధ్యక్షతన జరిగిన జనగామ మున్సి పల్ 2024-25 బడ్జెట్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పర్మర్ పింకేశ్ కుమార్ పాల్గొన్నారు. పట్టణ అభివృద్ధిలో కీలకమైన బడ్జెట్ సమావేశానికి అధికారులు డుమ్మా కొట్టా రు.. కౌన్సిల్ సమావేశాలంటే గౌరవం లేకుండా పోతోందంటూ కొందరు కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేశారు. జిల్లా హెడ్క్వర్టర్.. పెద్ద మున్సిపా లిటీకి డిప్యుటేషన్ అధికారులేంటి అని నిలదీశారు. దీంతో గంటన్నర ఆలస్యంగా బడ్జెట్ సమావేశం మొదలైయింది.
కౌన్సిలర్ల ప్రశ్నల పరంపర
ఈ ఏడాది బడ్జెట్ లో పెరిగిన ఆస్తిపన్ను ఎలా చూపించారని బీజేపీ ఫ్లోర్ లీడర్ మహంకాళి హరిశ్చంద్ర గుప్తా ప్రశ్నించారు. గత ఏడాది కంటే ఆస్తిన్నుల రూపంలో రూ. కోటికి పైగా పెరగవచ్చని చేసిన అంచనాకు సంబంధించి వివరాలు చూపించాలని పట్టుబడ్డారు. బడ్జెట్ పేరిట అంకెల మార్పి డి చేశారని అన్నారు. అనేక కాలనీలు, వార్డు ల్లో నూతన నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు వాటికి అసెస్మెంట్ చేయకపోవడంతో పెద్ద ఎత్తున ఆదాయం కోల్పోతున్నామని మండిపడ్డారు. గతం లో రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా మున్సిపాలిటీకి వచ్చే కోట్లాది రూపాయల స్టాంప్ డ్యూటీ నేరుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడంతో పురపాలికలకు నిధుల కొరత ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు కనీస పరిజ్ఞానం లేకుండా బడ్జెట్ రూప కల్పన చేశారని కాంగ్రెస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గాదె పాక రాంచందర్ ఆరోపించారు. బడ్జెట్లో వాస్తవా లు కనిపించడం లేదని, సామాన్యులకు మేలు చేసే కనీస సౌకర్యాలు లేవని మండిపడ్డారు. రూ.5 లక్ష లు ఖర్చు చేసి కనీసం ప్యాచ్ వర్క్ చేయలేని బడ్జెట్ ను ఎందుకు ఆమోదించాలని ప్రశ్నించారు. ట్రేడ్ లైసెన్స్ల నుంచి జంతువధశాల, స్టాంపుల వరకు కఠినతరం చేస్తే ఆదాయం పెరుగుతుందని సూచించారు.
సభ్యురాలు జక్కుల అనితవేణుమాధవ్ మాట్లాడుతూ శానిటేషన్ కార్మికులకు సబ్బులు, నూనె ఇచ్చినట్టు బడ్జెట్ కాపీలో చూపించడమే తప్ప ఏనాడూ ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. బడ్జెట్ సమావేశంలో అధికారులు లేకపోవడం మున్సిపల్ చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చని విస్మయం వ్యక్తం చేశారు. మారబోయిన పాండు మాట్లాడుతూ చెత్త సేకరణ ఆటోలకు రిజిస్ట్రేషన్ ఆలస్యం చేయడం కారణంగా భవిష్యత్లో ఇబ్బం దులు కలిగే ప్రమాదం ఉందన్నారు. ఎండీ. సమ్మద్ మాట్లాడుతూ పన్నుల వసూళ్లలో బిల్ కలెక్టర్లు శ్రద్ధ వహించాలని, ఈ విషయమై అధికారుల పర్యవేక్ష ణ ఉండాలన్నారు. వంగాల కల్యాణిమల్లారెడ్డి మాట్లాడుతూ బడ్జెట్ సమావేశానికి పలు విభాగాల అధికారుల గైర్హాజర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాంకోడు అనిత మాట్లాడుతూ బడ్జెట్లో బ్లీచింగ్ పౌడర్, దోమల మందు చూపించడమే తప్ప ఎక్కడా కనిపించడం లేదని మండిపడ్డారు. అనంత రం 2024-25 వార్షిక బడ్జెట్ రూ.27.43 కోట్లకు ఆమోదం తెలిపారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ పి. వెంకటేశ్వర్లు. వైస్ చైర్మన్ మేకల రాం ప్రసాద్, మేనేజర్ రాములు, శానిటరీ ఇన్స్పెక్టర్ మల్లిగారి మధు, శ్రీకాంత్, సురేందర్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.