ఆ స్థలంలో వాళ్లకు ఎలాంటి సంబంధం లేదు.. కానీ ఓ నిర్మాణ సంస్థ సొంత లాభం కోసం ప్రభుత్వ భూమి లోంచి డ్రైనేజీ , రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు. అయినా మున్సిపల్ శాఖ అధికారులు తమకేమి పట్టనట్లుగా వ్యవహారిస్తున్నారు. గతంలోనే ఈ అంశంపై సమాచార హక్కు చట్టం కింద కోరగా.. మున్సిపల్ ను ఎలాంటి పర్మిషన్లు ఇవ్వలేదని అధికారులు లిఖితపూర్వకంగా ఇచ్చారు. అయినా వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోవవడం లేదు. కరీంనగర్ మున్సిపల్ పరిధిలోని రేకుర్తిలో చోటు చేసుకున్న ఘటనపై బీజేపీ ఎస్సీ మోర్చా మాజీ అధికార ప్రతినిధి దుర్గం మారుతి కరీంనగర్ కార్పొరేషన్ కమిషనర్ కు మంగళవారం ఫిర్యాదు చేశారు. డ్రైనేజి మరియు రోడ్ నిర్మాణానికి అనుమతులు తీసుకోకుండా రేకుర్తి ప్రభుత్వ భూమి సర్వే నం. 133 లో అక్రమంగా డ్రైనేజి , రోడ్డు నిర్మాణం చేస్తున్న ఆర్.ఎస్.డి హిల్ సంస్థ పై సంబంధిత అధికారులతో మరొసారి విచారణ చేపట్టాలన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అమలులో ఉన్న కొత్త మున్సిపల్ చట్ట ప్రకారం అక్రమ నిర్మాణం చేస్తున్నవారిమీద విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అక్రమంగా చేపడుతున్న నిర్మాణాలను వెంటనే నిలిపివేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆయన రేకుర్తి ప్రజల తరఫున కోరారు. రేకుర్తిలో ఎంతో మంది భూమి లేని నిరుపేదలున్నారని.. వారికి చెందాల్సిన భూములను కొందరు బడా సంస్థలు అక్రమ నిర్మాణాలు చేపట్టడం ఏమిటని మారుతి తీవ్రంగా మండిపడ్డారు.