కరీంనగర్ శివారు రేకుర్తిలో భూ కబ్జాలకు పాల్పడుతున్న వారిపై స్థానికుడు దుర్గం మనోహార్ సీఎం ప్రజా వాణిలో ఫిర్యాదు చేశారు. ఇప్పటికే కరీంనగర్ లో భూ కబ్జాలకు పాల్పడుతున్న ఇద్దరు కార్పొరేటర్లను కటకటాలకు పోలీసులు పంపించారు. మరో ఇద్దరు కార్పొరేటర్లు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 18వ డివిజన్ కార్పొరేటర్ సుధగోని మాధవి భర్త సుధగోని కృష్ణ కుమార్ గౌడ్ SRSP కెనాల్ స్థలంలో 8వ నెల 2023 సంవత్సరం లో రేకుర్తికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి టీచర్ఎ నగందుల రవీందర్ గౌడ్ MCK టౌన్ ప్లానింగ్ అధికారి AE ఆకారపు నవీన్ RKT విద్యుత్తు లైన్మెన్ ఆరేపల్లి శామయ్య ఈ నలుగురు కుమ్మక్కై SRSP కెనాల్ భూమి లో బిల్డింగ్ దౌర్జన్యంగా నిర్మాణం చేపట్టినారని దుర్గం మనోహార్ ఫిర్యాదు చేశాడు. కరీంనగర్ కు చెందిన కొత్త రాజిరెడ్డి ఫిర్యాదుతోనే డొంక కదిలి అరెస్టులు అయ్యాయి. మనోహర్ ఫిర్యాదును లెక్కలోకి తీసుకుని ఆ ఏరియాలో జరుగుతున్న అక్రమాలు బయటకు తీస్తారా.. వీరి వెనక ఉన్న పెద్దలను బయటకు లాగుతారా అనేది ఆసక్తికరంగా మారింది.