నీటి లభ్యత పక్కనబెడితే కేసీఆర్ రాజకీయ కోణమే ఎక్కువగా కనిపిస్తుందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై శుక్రవారం భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ వద్ద నిర్వహించిన సమీక్ష లో ఆయన మాట్లాడారు. మేడిగడ్డ , సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లో డిజైన్ లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.. వాటి కోసం చేసిన వడ్డీలు ప్రజల మీద పడుతున్నాయన్నారు. నేషనల్ ప్రాజెక్టుకు సరైన రీతిలో దరఖాస్తును గత ప్రభుత్వం చేయనలేదు.. తాను ఎంపీగా పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకు జవాబుగా సీడబ్ల్యూసీ 11 జులై 2019 నివేదిక వెల్లడించారని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా బ్యారేజీల్లో 2, 3 టీఎంసీ కన్న ఎక్కువ నీటి నిల్వ ఉండదు.. కానీ ఇక్కడ మాత్రం బ్యారేజీ కట్టి 16 టీఎంసీలు స్టోరేజీ చేయడం వల్ల నిర్మాణాలు ఎందుకు పనికి రాకుండా పోయాయి.. ప్రజలపై భారం పడుతుందన్నారు. మ్యానిఫొస్టోలో చెప్పినట్లుగా జ్యూడీషియల్ విచారణ చేపట్టబోతున్నం.. తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును కట్టబోతున్నామని మంత్రి స్పష్టం చేశారు.
తొందరగా కట్టాలనే ఇష్టానుసారం అనుమతి తీసుకున్నారు.. తన మార్క్ కనిపించాలనే కేసీఆర్ ప్రాజెక్టు కట్టారు .. 3వ టీఎంసీ పనులను నామినేషన్ పై ఇవ్వాల్సిన అవసరమేంటి..ఏమిటని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రశ్నించారు. రూ. 50వేల కోట్ల అవినీతి జరిగిందని... జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ ఈఎన్ సీ ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీఐజీ రిపోర్టు ఇచ్చిందని.. చెన్నూరు, మంథని ప్రాంతాలకు చెందిన పొలాలు ముంపునకు గురవుతున్నాయని.. మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.